బ‌చ్చ‌న్ పాప కోరిక ఈసారైనా తీరుతుందా?

కానీ భాగ్య శ్రీ బోర్సేకి అదృష్టం కొద్దీ అవ‌కాశాలైతే బాగానే వ‌స్తున్నాయి. అమ్మ‌డు న‌టించిన మొద‌టి తెలుగు సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ భాగ్య‌శ్రీకి తెలుగులో అవ‌కాశాలొచ్చాయి.;

Update: 2025-07-25 16:30 GMT

ఎవ‌రైనా స‌రే ఓ కొత్త ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్న‌ప్పుడు మొద‌టి సినిమా ఫ‌లితం వారి కెరీర్ పై చాలా ప్ర‌భావం చూపిస్తుంది. అది హీరోకైనా, హీరోయిన్‌కైనా. హీరోయిన్ల విష‌యంలో అది మ‌రీ ఎక్కువ‌. ఒక‌వేళ మొద‌టి సినిమానే హిట్ అయితే ఆ త‌ర్వాత వ‌రుస ఛాన్సులు త‌లుపు త‌డ‌తాయి. ఫ్లాపైతే అవ‌కాశాల కోసం మ‌ళ్లీ చాలానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

కానీ భాగ్య శ్రీ బోర్సేకి అదృష్టం కొద్దీ అవ‌కాశాలైతే బాగానే వ‌స్తున్నాయి. అమ్మ‌డు న‌టించిన మొద‌టి తెలుగు సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ భాగ్య‌శ్రీకి తెలుగులో అవ‌కాశాలొచ్చాయి. దానికి కార‌ణం అమ్మ‌డు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ప్ర‌మోష‌న్స్ లో చేసిన ర‌చ్చ‌తో పాటూ అమ్మ‌డి అందం కూడా. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా రిలీజ్ కు ముందే భాగ్య శ్రీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది.

అమ్మ‌డి అందం, ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొన‌డం ఇవ‌న్నీ అంద‌రినీ ఇంప్రెస్ చేశాయి. మొద‌టి సినిమాతోనే హిట్ కొట్టి టాలీవుడ్ లో పాగా వేద్దామ‌ని అమ్మ‌డు ఎంతో ట్రై చేసింది కానీ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఆఖరికి డిజాస్ట‌ర్ గా మిగిలింది. ఆ సినిమా కోసం భాగ్య‌శ్రీ ఎంత క‌ష్ట‌పడినా అదంతా వృధానే అయింది. ఇక ఇప్పుడు భాగ్య‌శ్రీ నుంచి రెండో సినిమా రాబోతుంది. అదే కింగ్‌డ‌మ్. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా జులై 31న రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాపై భాగ్య‌శ్రీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే కింగ్‌డ‌మ్ హిట్ ఆమె కెరీర్ కు చాలా ముఖ్య‌మైన‌ది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో పోల్చుకుంటే కింగ్‌డ‌మ్ పెద్ద సినిమా కూడా. ఈ సినిమాలో భాగ్య‌శ్రీ చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే మేక‌ర్స్ ఆమె క్యారెక్ట‌ర్ ను పెద్ద‌గా రివీల్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రి కింగ్‌డ‌మ్ అయినా భాగ్య‌శ్రీకి కోరుకున్న విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి. కింగ్‌డ‌మ్ హిట్టైతే భాగ్య‌శ్రీకి వ‌రుస అవ‌కాశాల‌తో పాటూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ప్ర‌స్తుతం భాగ్య‌శ్రీ బోర్సే హీరో రామ్ పోతినేని స‌ర‌సన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి డైరెక్ట‌ర్ మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News