భాగ్యం ఇదేం మాస్ రాంపేజ్ బాబోయ్..!
ఆల్రెడీ సితార బ్యానర్ లో కింగ్ డం చేస్తున్న భాగ్య శ్రీ పనిలో పనిగా మరో ఆఫర్ అందుకుంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా అది కూడా ఫ్లాప్ అయిన కూడా భాగ్య శ్రీకి బంపర్ ఆఫర్లు..;
టాలీవుడ్ లో కాస్త టాలెంట్ ఉన్న హీరోయిన్ వస్తె చాలు ఆమెకు వరుస అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తారు. అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే అలా కాదు. కొందరికి అది కూడా లక్ ఉన్న వారికి మాత్రమే అలా జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి లక్కీ గాళ్ గా క్రేజీ ఛాన్స్ అందుకుంటుంది భాగ్య శ్రీ బోర్స్. మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ. హరీష్ శంకర్ ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్ కి అదేంటో బాగా కలిసి వస్తుంది. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా కూడా భాగ్యానికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం అమ్మడు కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా, కాంతా సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ పడ్డా అమ్మడిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఇది చాలదు అన్నట్టుగా మరికొన్ని సినిమాలు వచ్చి యాడ్ అవుతున్నాయి. భాగ్య శ్రీ ఖాతాలో లేటెస్ట్ గా అక్కినేని అఖిల్ లెనిన్ కూడా వచ్చి చేరిందని టాక్. శ్రీలీల చేయాల్సిన ఆ సినిమా కాస్త ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ కాగా ఆ ఛాన్స్ భాగ్య శ్రీ కొట్టేసింది.
ఆల్రెడీ సితార బ్యానర్ లో కింగ్ డం చేస్తున్న భాగ్య శ్రీ పనిలో పనిగా మరో ఆఫర్ అందుకుంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా అది కూడా ఫ్లాప్ అయిన కూడా భాగ్య శ్రీకి బంపర్ ఆఫర్లు.. చెప్పాలంటే ఒక దానికి మించి మరొక ఆఫర్ అన్నట్టుగా వస్తున్నాయి. అఖిల్ లెనిన్ ఛాన్స్ అయితే ఆమెకు నిజంగానే లక్కీ అనిపించేలా చేసింది.
భాగ్య శ్రీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మిస్టర్ బచ్చన్ లో తన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ని అలరించింది. అంతేకాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా యాక్టివ్ గా కనిపించింది. అదే అమ్మడికి అవకాశాలు తెచ్చేలా చేస్తుంది. కింగ్ డం సినిమా నుంచి వచ్చిన సాంగ్ తో యూత్ ఆడియన్స్ కి దగ్గరైంది భాగ్య శ్రీ. చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో కొన్నాళ్లు తన హవా కొనసాగించేలా ఉందనిపిస్తుంది. ఇక రిలీజ్ ల విషయానికి వస్తే భాగ్య శ్రీ నటించిన కింగ్ డమ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఆంధ్రా కింగ్ తాలూకా కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఈ రెండు సినిమాలు హిట్లు పడితే మాత్రం భాగ్య శ్రీ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.