కన్నడ నుంచి బాలీవుడ్ లో మరో సంచలనమే!
బెంగుళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి ఏలింది ఎంత మంది హీరోయిన్లు? అంటే ప్రముఖంగా ఇద్దరు భామల గురించి చెప్పాలి.;
బెంగుళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి ఏలింది ఎంత మంది హీరోయిన్లు? అంటే ప్రముఖంగా ఇద్దరు భామల గురించి చెప్పాలి. తొలుత ఐశ్వర్యారాయ్ బెంగుళూరు నుంచే బాలీవుడ్ కి వెళ్లింది. `ఇరువార్` తో కోలీవుడ్ కి పరిచ యమైన ఐశ్వర్యారయ్ `ఔర్ ప్యార్ హోగయా`తో బాలీవుడ్ లో లాంచ్ అయింది. అటుపై `జీన్స్` తో కోలీవుడ్ లో సంచలనమైంది. ఈ విజయాల తర్వాత బాలీవుడ్ లో ఐశ్వర్యారాయ్ ఎదిగిన తీరు గురించి చెప్పాల్సిన పనిలేదు. అమె అందమై బోలెడన్ని అవకాశాలు తెచ్చి పెట్టింది. నటిగా బాలీవుడ్ లో తారా స్థాయికి చేరింది.
స్టార్ హీరో ప్రోత్సాహంతో:
అనంతరం పై అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడి బాలీవుడ్ లో స్థిరపడి పోయింది. అదే పరిశ్రమలో బెంగుళూరు నుంచి వెళ్లిన మరో నటి దీపికా పదుకొణే ప్రయాణం కూడా ఇలాగే సాగింది. అయితే ఈ అమ్మడు కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అటుపై `ఓం శాంతి ఓం`తో బాలీవుడ్ లో చాన్స్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడి ఉత్తరాది ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలు అందుకుంది. ఐశ్వర్యారాయ్ కంటే వేగంగానే ఉత్తరాదిన హీరోయిన్ గా అగ్ర తాంబూలం అందుకుంది. అనంతరం రణవీర్ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకురని స్థిరపడింది.
యానిమల్ తో సంచలనం:
వీళ్లిద్దరి ప్రయాణం స్పూర్తితో రష్మికా మందన్నా బాలీవుడ్ ప్రయాణం సాగుతోందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. కన్నడ పరిశ్రమలో లాంచ్ అయిన రష్మిక అటుపై టాలీవుడ్లో అగ్ర హీరోయిన్ గా ఎలా ఎదిగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కడ నుంచి అంతే వేగంగా పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోలనే క్యూలో నిలబెట్టింది. `గుడ్ బై` తో మూడేళ్ల క్రితమే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా అమ్మడు `మిషన్ మజ్ను`లో భాగమైంది. ఈ రెండు పెద్దగా గుర్తింపునివ్వలేదు.
బెంగుళూరు నుంచి నెంబర్ థర్డ్:
కానీ `యానిమల్` విజయంతో మాత్రం బాలీవుడ్ ని షేక్ చేసింది. ఒక్క విజయంతో ఇండియానే అల్లాడించింది. ఆ వెంటనే `చావా`తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. `సికిందర్` తో పరాజయం ఎదురైనా రష్మిక ఇమేజ్ లో అదెక్కడా హైలైట్ అవ్వలేదు. ఫాలోయింగ్ లోనూ అక్కడ స్టార్ భామలకు పోటీగా నిలిచింది. రష్మిక అంటే ఓ బ్రాండ్ ఇమేజ్ ని ఇండస్ట్రీలో వేసింది. దీంతో రష్మికతో నటించడానికి స్టార్ హీరోలే ఎదురు చూస్తున్నారు. అలా బెంగుళూరు నుంచి మరోసారి బాలీవుడ్ ని షేక్ చేస్తోన్న నటిగా రష్మిక మందన్నానెట్టింట చర్చనీయాంశంగా మారింది.