• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలెంటెడ్ డైరెక్టర్ పై...

టాలెంటెడ్ డైరెక్టర్ పై బెల్లంకొండ ఫోకస్

| రీసెంట్ గా టైసన్ నాయుడు నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-02-04 23:30 GMT

టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. తనదైన యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా టైసన్ నాయుడు నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఖిలాడీ డైరెక్టర్ రమేశ్ వర్మతో రాక్షసుడు 2 సినిమాను త్వరలో సాయి శ్రీనివాస్ చేయనున్నారు. రాక్షసుడు వంటి క్రైమ్ థ్రిల్లర్ కథతో ఆయన మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు రాక్షసుడు 2 వస్తుండటంతో మరోసారి హిట్ అందుకోవడం కన్ఫర్మ్ అనేలా అంచనాలున్నాయి. వీటితోపాటు శ్రీనివాస్ మరో రెండు చిత్రాలకు కమిట్ అయినట్లు సమాచారం. వాటిల్లో ఒక మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

నాంది సినిమాతో విభిన్నమైన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ ఓ సినిమా చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సామాజిక ఇతివృత్తంతో కూడిన స్టోరీని విజయ్.. బెల్లంకొండకు చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట.

ఈ మూవీ ద్వారా డైరెక్టర్ విజయ్ కనకమేడల.. ఆరోగ్య శాఖలో ఉన్న లోపాలను చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ డాక్టర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. మెహ్రీన్ హీరోయిన్‌ గా నటించనుందని టాక్. అయితే ఈ బ్యూటీకి కొన్ని నెలలుగా అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. దీంతో ఈ సినిమాతో మెహ్రీన్ రీ లాంఛ్ అయిన‌ట్టే.

తొలి సినిమా నాందితో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. అక్రమ నేరారోప‌ణ‌తో జైల్లో మ‌గ్గుతున్న ఓ యువ‌కుడి కథను చూపించారు. అల్లరి నరేశ్ సినీ కెరీర్‌ లో ఈ చిత్రం మంచి విజయంగా నిలిచింది. కానీ రెండో సినిమాగా విజయ్, నరేశ్ కలిసి చేసిన ఉగ్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు తన మూడో సినిమా కోసం రూటు మారుస్తున్నారు విజయ్. తొలి రెండు చిత్రాలకు భిన్నంగా ఓ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో బెల్లంకొండ సినిమా ఉండబోతుందని టాక్. మరి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.




 


Tags:    
  • Tollywood 
  • Bellamkondasrinivas 
  • Actor 
  • Bollywood 
  • Talenteddirectors 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS