• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెల్లంకొండవి గొప్ప...

బెల్లంకొండవి గొప్ప రికార్డులే… కానీ

| బెల్లంకొండ శ్రీనివాస్ కి మరో అరుదైన గుర్తింపు ఉంది. అతని సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ వస్తూ ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2024-02-22 04:10 GMT

తెలుగులో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోన్న నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కమర్షియల్, యాక్షన్ కథలతో, భారీ బడ్జెట్ తో మూవీస్ చేస్తూ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అతని కెరియర్ లో చేసిన కొన్ని సినిమాలు బాగున్నాయనే టాక్ వచ్చిన కూడా బడ్జెట్ లు ఎక్కువ కావడంతో కమర్షియల్ గా సక్సెస్ లు సాధించినవి తక్కువ అని చెప్పాలి.

బెల్లంకొండ శ్రీనివాస్ కి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన మూవీ అంటే రాక్షసుడు మాత్రమే. ఆయన నటించిన జయ జానకీ నాయకా, సాక్ష్యం బాగానే ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కి మరో అరుదైన గుర్తింపు ఉంది. అతని సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ వస్తూ ఉంటుంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై డబ్బింగ్, స్ట్రైట్ హిందీ సినిమాల పరంగా అత్యధిక వ్యూవ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా కవచం మూవీ నిలిచింది. ఈ సినిమా యుట్యూబ్ లో డిఫరెంట్ ఛానల్స్ లో మొత్తం 830 మిలియన్స్ వ్యూవ్స్ కలిగి ఉంది. ఈ స్థాయిలో ఏ ఇతర ఇండియన్ మూవీ కూడా వ్యూవ్స్ సొంతం చేసుకోలేదు. అలాగే జయ జానకీ నాయకా సినిమాకి 800 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. డిజాస్టర్ మూవీ సీతకి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

యుట్యూబ్ లో వ్యూవ్స్ పరంగా తన సినిమాలతో బెల్లంకొండ శ్రీనివాస్ రికార్డులు సృష్టించాడు. తన సినిమాలకి నార్త్ లో విపరీతమైన ఆదరణ ఉందని, తనకి అక్కడ ఈజీగా సక్సెస్ వస్తుందని అనుకోని హిందీలో ఛత్రపతి మూవీ రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 80 కోట్ల వరకు సినిమాకి ఖర్చు పెడితే అందులో కనీసం 10 శాతం కూడా రికవరీ రాలేదు.

ఈ సినిమా రిజల్ట్ తో ఒకటైతే స్పష్టం అయ్యింది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలని యుట్యూబ్ లో ఫ్రీగా చూడటానికి మాత్రమే ఇష్టపడతారు. టికెట్ కొనుక్కొని థియేటర్స్ కి వెళ్లి 2 గంటలు టైం స్పెండ్ చేసి చూడరు. కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే కాకుండ సౌత్ ఇండియన్ యాక్షన్ మూవీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి యుట్యూబ్ లో మాత్రమే ఆదరణ ఉంటుందని క్లారిటీ వచ్చింది.

Tags:    
  • Bellamkondasrinivas 
  • Bollywood 
  • Tollywood 
  • Rakshasudu 
  • Jayajankinayaka 
  • Youtuberecord 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS