గట్టి ప్లానింగ్ తో బెల్లంకొండ..?
యువ హీరోల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన వరకు ది బెస్ట్ ఇస్తున్నాడు.;
బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా భైరవం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. యువ హీరోల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన వరకు ది బెస్ట్ ఇస్తున్నాడు. భైరవం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ రెండు క్రేజీ సినిమాలతో వస్తున్నాడు. ఆ రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్నాయి.
సాగర్ చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు..
సాగర్ చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు సినిమా వస్తుంది. సాగర్ చంద్ర టాలెంటెడ్ డైరెక్టర్.. అతనితో బెల్లంకొండ చేస్తున్న సినిమా కూడా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని టాక్. సినిమాలో హీరో ఒక పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా డిఫరెంట్ ట్రీట్మెంట్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు కిష్కింధపురి చేస్తున్నాడు.
ఈ సినిమాను కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో హర్రర్ నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాపై కూడా బెల్లంకొండ బాబు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. ఈ రెండు సినిమాల విషయంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తున్నారని తెలుస్తుంది. కిష్కింధపురి సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది. టైసన్ నాయుడులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా చేస్తుంది.
ప్రతి సినిమాకు తను ఫుల్ ఎఫర్ట్స్ ..
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమాకు తను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నాడు. ఐతే ఫలితాలు కొన్నిసార్లు పాజిటివ్ గా ఉన్నా లేకపోయినా తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు శ్రీనివాస్. భైరవం తో మంచు మనోజ్, నారా రోహిత్ తో కలిసి పనిచేశాడు బెల్లంకొండ హీరో. ఫ్యూచర్ లో కూడా మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడు రెడీ అన్నట్టు చెబుతున్నాడు.
బెల్లంకొండ హీరో నుంచి రాబోతున్న ఈ రెండు సినిమాలు ఆడియన్స్ కి మంచి ట్రీట్ అందిస్తాయని తెలుస్తుంది. టైసన్ నాయుడు, కిష్కింధపురి ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఒక మాస్ హిట్ కొట్టి తన స్టామినా ఇది అని ప్రూవ్ చేసుకోవాలని బెల్లంకొండ హీరో ట్రై చేస్తున్నాడు. రాబోతున్న ఈ రెండు సినిమాలు బెల్లంకొండ హీరో కలని నిజం చేసేలా ఉన్నాయి. అదే జరిగితే బెల్లంకొండ మాస్ ఆడియన్స్ సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు.