అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి ఇమేజ్ కావాలి
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం.;
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం. మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా శ్రీనివాస్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
యాక్టర్ అవకముందు బాంబేలో కొన్నాళ్లపాటూ ట్రైనింగ్ తీసుకున్నానని, యాక్టర్ అయ్యాక ముంబైకి చెందిన బడా నిర్మాణ సంస్థ నుంచి ఓ మూడు సినిమాలు చేయమని ఆఫర్ వచ్చిందని, మొదట్లో దాని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తర్వాత తండ్రి చెప్పడంతో వాళ్ల ఆఫర్లు ఒప్పుకున్నానని, 2019లోనే ఛత్రపతికి సైన్ చేశానని శ్రీనివాస్ తెలిపాడు.
బాలీవుడ్ లో సినిమాలు చేసిన తెలుగు యాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారని, చరణ్ చేసినప్పటికీ అది జంజీర్ రీమేక్ అని, హిందీ సినిమాను హిందీలోనే చేయడం వల్ల ఆ సినిమా ఆడలేదని చెప్పిన శ్రీనివాస్, ఛత్రపతి సౌత్ సినిమా పైగా రాజమౌళి సినిమా కావడం వల్ల అది వర్కవుట్ అవుతుందని నిర్మాత చెప్పడంతో ఆ సినిమా చేశామని, అలా రీమేక్ చేయకుండా ఉండాల్సిందని, షూటింగ్ టైమ్ లోనే ఈ మూవీ వర్కవుట్ అవుతుందా లేదా అని డైలమాలో పడ్డానని దాని వల్లే 100% సినిమాపై ఫోకస్ చేయలేకపోయానని శ్రీనివాస్ చెప్పాడు.
మనం చేసే ప్రతీ సినిమా మనకు ఏదొకటి నేర్పిస్తుందని, తాను ప్రభాస్ సినిమానూ రీమేక్ చేస్తా, అలానే తమిళ నటుడు సూరి సినిమానీ రీమేక్ చేస్తానని, అది తన స్టైల్ అని, ఈ నటుడు ఎలాంటి పాత్రకైనా సరిపోతాడనే పేరు తెచ్చుకోవాలనేది తన ప్రయత్నమని, బాలీవుడ్ లో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ అన్ని రకాల పాత్రలు చేస్తారని, నాక్కూడా అలాంటి ఇమేజ్ కావాలని శ్రీనివాస్ మనసులోని మాటను బయటపెట్టాడు.
తాను చేయబోచే సినిమాలన్నీ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలేనని, తన నుంచి ఎవరూ ఊహించని సినిమాలు ఫ్యూచర్ లో రాబోతున్నాయని, సినిమాల్లో తన కోసం డూప్స్ వర్క్ చేస్తారనే మాటల్లో ఎలాంటి నిజం లేదని, డూప్స్ ను వాడటం తనకు ఇష్టముండదని, తనకంటూ ఓ స్పెషల్ స్టైల్ ఉందని, దాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరని శ్రీనివాస్ చెప్పాడు.