కిష్కింధపురిలో ఆ రిఫరెన్సులు?
రీసెంట్ గా భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.;
రీసెంట్ గా భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే కిష్కింధపురి. శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. కౌశిక్ పెగిళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించారు.
రెగ్యులర్ హార్రర్ సినిమాల్లా కాదు
ఇప్పటికే ప్రోమోలు, టీజర్, ట్రైలర్ ద్వారా మంచి హైప్ ను తెచ్చుకున్న కిష్కింధపురి హార్రర్ థ్రిల్లర్ జానర్ లోనే కొత్తగా తెరకెక్కిందని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ హార్రర్ సినిమాల మాదిరి కాకుండా అందులోని గ్రిప్పింగ్ స్టోరీ, అసాధారణ కథతో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. ఈ కథకు శ్రీనివాస్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని, కథ విన్న తర్వాత ఆయనెలాంటి మార్పులు చెప్పలేదని తెలుస్తోంది.
రామాయణం నుంచి స్పూర్తి పొంది
అంతేకాదు, కిష్కింధపురి కథ రామాయణం నుంచి ఇన్‌స్పైర్ అయి తీసుకుందని కూడా టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి కిష్కింధపురి అనే టైటిల్ వినగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది రామాయణమే. కథ, సినిమాలోని చాలా అంశాలు రామాయణంకు కనెక్ట్ అయి ఉంటాయని కూడా అంటున్నారు. ఇప్పటికే రామాయణం నుంచి స్పూర్తి పొందిన సినిమాలు ఎన్నో వచ్చాయి.
అలా వచ్చిన సినిమాలన్నీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కిష్కింధపురి కూడా ఆ సక్సెస్‌ఫుల్ మార్గాన్నే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. టెక్నికల్ గా కూడా కిష్కింధపురి చాలా రిచ్ గా కనిపిస్తోంది. అందుకే చిత్ర యూనిట్ సినిమాపై అంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పాజిటివ్ బజ్ తో రిలీజ్ కానుంది. మరి కిష్కింధపురి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.