చిరుకు రాజ మర్యాద వెనుక బలమైన కారణం అదేనా?
కొంతకాలంగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేని టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. రీసెంట్ గా తన ఇంట్లో భారీ స్థాయిలో దీపావళి పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.;
కొంతకాలంగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేని టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. రీసెంట్ గా తన ఇంట్లో భారీ స్థాయిలో దీపావళి పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న దివాళీ పార్టీ కల్చర్ ను టాలీవుడ్ లో స్టార్ట్ చేసి ట్రెండ్ సెట్ చేశారు. అనేక మంది సెలబ్రిటీలను ఇన్వైట్ చేయడంతో.. బండ్ల పార్టీ అంతా కళకళలాడింది. ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా బండ్ల గణేష్ ఆహ్వానించగా.. ఆయన వచ్చి ఓ రేంజ్ లో సందడి చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి.
అయితే చిరుకు బండ్ల చేసిన రాజ మర్యాద.. ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ అలా కారు దిగగానే వెంటనే కాళ్లు మొక్కారు బండ్ల గణేష్. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకుని.. చేయి పట్టుకొని చిరును లోపలికి తీసుకెళ్లి ఆయనకంటూ ఒక సెపరేట్ చైర్ లో కూర్చోబెట్టి అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా చిరు కోసమే ప్రత్యేకంగా కుర్చీ చేయించారు. ఆ విషయాన్ని బండ్లనే తెలిపారు. అందులో చిరంజీవి కూర్చున్న క్షణం.. మనసు ఎంతో ఉప్పొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు.
అయితే అంతలా బండ్ల రాజ మర్యాద చేయడం వెనుక బలమైన కారణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. అలాగే ఇండస్ట్రీలో నలుగురికి సపోర్ట్ గా ఉండడమే కాకుండా బ్లడ్ బ్యాంకు అలాగే ఎంతో మంది ఫ్యాన్స్ కు సహాయం చేశారు. అలాగే కరోనా టైమ్ లో ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ సేవా గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో హీరోగా బాక్సాఫీస్ కింగ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక ఇవన్నీ కాకుండా బండ్లన్న మరింత భక్తితో మెగాస్టార్ ను గౌరవించడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందని ఇదేనని ఇప్పుడు అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి.. బండ్ల గణేష్ కు రెండు సార్లు కోవిడ్ వైరస్ ఎటాక్ అయింది. ఆయన ఫ్యామిలీ కరోనా బారిన పడింది. అప్పుడే చిరుకు బండ్ల కాల్ చేసి పరిస్థితి అంతా వివరించగా, ఆయన చికిత్సకు ఏర్పాట్లు చేశారు.
అపోలోలో పది మంది డాక్టర్లతో బండ్ల గణేష్ కు అప్పట్లో చికిత్స చేయించారు మెగాస్టార్. గట్టిగా మందలించారు కూడా. ఆ విషయాన్ని బండ్ల గణేష్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది ఒక్క రోజు లేట్ అయితే చనిపోయేవాడినని, చిరు కాపాడారని చెప్పారు. మొదటి సారి కరోనా వస్తే, రెండో సారి మళ్లీ ఎటాక్ అవ్వదని లైట్ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కానీ రెండో సారి 80 శాంత లంగ్స్ చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు బండ్ల తెలిపారు. మరొక్క రోజు లేట్ అయితే తాను మరణించేవాడినని చెప్పినట్లు వెల్లడించారు. ఆ సమయంలో సుమారు 100 సార్లు కాల్ చేసి కేర్ తీసుకున్నారని.. ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని గట్టిగా తిటినట్లు పేర్కొన్నారు. తన ప్రాణాలు కాపాడినా, ప్రాణం పోసిన చిరు అంటే తనకు చాలా గౌరవమని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరంజీవికి అంత రాజ మర్యాద చేయడం వెనుక ఇదే కారణం అయిండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే అదొక్కటే కారణమని మనం అనుకోకూడదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి బండ్ల గణేష్ ఎంత పెద్ద భక్తుడో అందరికీ తెలిసిన విషయమే. ముందు నుంచి కూడా బండ్ల.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ను చాలా అభిమానిస్తున్నారు. కాబట్టి ఒక్క కారణమే కాకుండా చాలా ఉండే ఉంటాయని చెప్పాలి. అయినా చిరంజీవికి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కొన్నేళ్లుగా మెగా చైర్ లో నెం.1 హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు కుదిరింది కనుక బండ్ల గణేష్.. పార్టీకి ఆహ్వానించి అంతటి రాజ మర్యాద చేసి తన అభిమానాన్ని చాటుకున్నారేమో.