ఎన్టీఆర్ తర్వాత బాలయ్య నోట మరోపేరు!
తొలుత తండ్రిని తలుచుకునే స్పీచ్ మొదలు పెడతారు. చిత్ర పరిశ్రమకు...ప్రజలకు రామారావు చేసిన సేవల్ని గుర్తు చేసుకునే సినిమాల గురించి మాట్లాడుతారు.;
స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసత్వాన్ని బాలకృష్ణ దిగ్విజయంగా చిత్ర పరిశ్రమలో కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. నందమూరి హీరోల్లో ఎంత మంది నటులైనా? బాలయ్య మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆయన శైలి అదే వంశంలో మరో నటుడుకి రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నందమూరి వారసుల్లో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా? బాలయ్య శైలి మాత్రం మరో నటుడికి సాటిరాదు. ఎన్టీఆర్ లెగస్సీని అందుకోవడం బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది. అందుకే బాలయ్య ఎలాంటి వేదికపైనైనా ముందుగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావించనిదే కొనసాగించారు.
షాక్ ఇచ్చిన సింహం:
తొలుత తండ్రిని తలుచుకునే స్పీచ్ మొదలు పెడతారు. చిత్ర పరిశ్రమకు...ప్రజలకు రామారావు చేసిన సేవల్ని గుర్తు చేసుకునే సినిమాల గురించి మాట్లాడుతారు. నటనలో తనకు ఓనమాలు దిద్దింది తండ్రేనని ఎంతో గర్వంగా చెబుతారు. నటుడిగా తనలో స్పూర్తి నింపింది డాడ్ తో పాటు , ఏఎన్నార్ పేరు కూడా చెబుతుంటారు. బాలయ్య నోట ఎల్లప్పుడు వారిద్దరు పేర్లు వస్తుంటాయి. మరే నటుడి గురించి బాలయ్య చెప్పరు. అలాంటి బాలయ్య పరభాష నటుడి గురించి మాట్లాడం ఆశ్చర్యకరం.
శివరాజ్ కుమార్ తమ్ముడు సమానం:
`వీరసింహారెడ్డి` సినిమాలో తన లుక్ కు సంబంధించి కన్నడ చిత్రం `మప్టీ`లోని శివరాజ్ కుమార్ గెటప్ నుంచే స్పూర్తిని పొందినట్లు..ఇచ్చి పుచ్చుకోవడం అన్నది తమకు అలవాటని బాలయ్య చెప్పడం ఇప్పుడో సంచలనం. అలాగే శివ రాజ్ కుమార్ ను తమ్ముడు అంటూ సంబోధించారు బాలయ్య. బాలయ్య హీరోగా నటించిన `అఖండ 2` రిలీజ్ నేపథ్యంలో కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఓ ఈవెంట్ లో బాలయ్య పై విధంగా స్పందించి షాక్ ఇచ్చారు. ఇంత వరకూ బాలయ్య ఏ వేదికపైనా ఇలా స్పందించలేదు.
సక్సెస్ మీట్ కూడా అక్కడేనా?
ఇతర వేదికలపై స్పందిం చాల్సి వచ్చిన సందర్బంలో ఆ నటుల చిత్రాల గురించి...నటుల గురించి మాట్లాడటం తప్ప! తనకు గానీ..తన సినిమాలకు గానూ స్పూర్తి అని స్పందించింది ఎక్కడా లేదు. తెలుగు లో ఇతర స్టార్ల చిత్రాల గురించి కూడా బాలయ్య ఎక్కడా మాట్లాడరు. అది ఎంత పెద్ద హిట్ సినిమా అయినా? సరే వాటి గురించి బాలయ్య వద్ద ఎలాంటి చర్చ ఉండదు. అలాంటి బాలయ్య నోట శివ రాజ్ కుమార్ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడం ఆసక్తికరం. దీంతో శివ రాజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేసారు. బాలయ్య తనకు సోదర సమానులన్నారు. `అఖండ2` విజయం సాధిస్తే గనుక విజయోత్సవాన్ని కూడా అదే వేదికపై గ్రాండ్ గా నిర్వహిస్తామన్నారు.