బాలయ్య ఎదుట.. 'NTR సీఎం' అంటూ..
అయితే రీసెంట్ గా ఆయన ఏలూరు వెళ్లారు. ఇప్పటికే ఓ జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బాలయ్య.. ఏలూరులోని బ్రాంచ్ ఓపెనింగ్ కు వెళ్లారు.;
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ.. ఏ కార్యక్రమానికి వెళ్లినా కచ్చితంగా మాట్లాడుతారు. ఆయన ఏం చెప్పాలనుకుంటారో మొత్తం చెప్పేస్తారు. కొన్నిసార్లు ఆగ్రహంగా.. మరికొన్నిసార్లు ఆవేశంగా.. ఇంకొన్నిసార్లు నవ్వుతూ మాట్లాడుతారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే రీసెంట్ గా ఆయన ఏలూరు వెళ్లారు. ఇప్పటికే ఓ జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బాలయ్య.. ఏలూరులోని బ్రాంచ్ ఓపెనింగ్ కు వెళ్లారు. హీరోయిన్ సంయుక్తతో సందడి చేశారు. ఆ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపమంతా నిండిపోయింది.
షాప్ ఓపెనింగ్ చేశాక.. వేదికపై మాట్లాడారు బాలయ్య. తన మార్క్ స్టైల్ మైక్ గాల్లో ఎగరేసి స్పీచ్ స్టార్ట్ చేశారు. ఆయన కాసేపు మాట్లాడిన వెంటనే.. కొందరు నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్.. సీఎం.. ఎన్టీఆర్.. సీఎం అంటూ నినదించారు. అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే బాలయ్య మాట్లాడిన సమయాల్లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ నినాదాలు వినిపించడం చాలా రేర్. అందుకే ఏలూరులో జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. కాగా.. బాలకృష్ణ, తారక్ మధ్య వైరం ఉన్నట్లు ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంటోంది. దానిపై ఇప్పటి వరకు బాలయ్య, తారక్ రెస్పాండ్ ఎప్పుడూ అవ్వలేదు.
కాగా.. బాలయ్య ఇప్పుడు అఖండ సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా.. ఒక్కో అప్డేట్ తో మేకర్స్ వాటిని పెంచుతున్నారు. దసరా కానుక సెప్టెంబరు 25న సినిమా విడుదల చేయనున్నారు.
మరోవైపు, తారక్ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ -2 డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన నటించిన దేవర మూవీ సీక్వెల్ లో కూడా యాక్ట్ చేయనున్నారు. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు.