• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య న్యూ టైటిల్.. ఇది...

బాలయ్య న్యూ టైటిల్.. ఇది ఫిక్స్ అయినట్లే..

| టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ మీద వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-13 05:21 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ మీద వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు NBK 109 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తోపాటు యాక్షన్ గ్లింప్సెస్ భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మెయిన్ గా బాలయ్యను ఇప్పటికి వరకు ఎన్నడూ చూడని రీతిలో చూపిస్తానని బాబీ చెప్పడంతో అంతా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో అప్డేట్స్ గురించి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను దీపావళికి రివీల్ చేస్తామన్న మేకర్స్.. రీసెంట్ గా నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మేకర్స్ షేర్ చేసిన పవర్ ఫుల్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విభిన్నమైన దుస్తులు ధరించిన బాలయ్య.. ఆయుధాలను పట్టుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

అదే సమయంలో ఇప్పుడు NBK 109 ప్రాజెక్టుకు టైటిల్ ను ఏది ఫిక్స్ చేశారోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. వీరమాస్, డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్.. ఈ మూడింట్లో ఒకటి ఫిక్స్ చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. టైటిల్ విషయంలో మేకర్స్ వారాల తరబడి చర్చలు జరిపారట. చివరకు బాలయ్య ఒక టైటిల్ ను రీసెంట్ గా ఫిక్స్ చేశారని టాక్.

డాకూ మహారాజ్ వైపు బాలయ్య మొగ్గు చూపారని.. అదే టైటిల్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేశారని ఇండస్ట్రీలో వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే మేకర్స్.. వీడియో సిద్ధం చేశారని తెలుస్తోంది. కార్తీక పౌర్ణమి స్పెషల్ గా మ్యాసివ్ అప్డేట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని సమాచారం. బాలయ్యనే ముహుర్తం ఫిక్స్ చేశారని వినికిడి.

అయితే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పిన NBK 109 మేకర్స్.. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో విడుదల చేయనున్న టైటిల్ టీజర్ తోనే సినిమా ఎప్పుడు వస్తుందో మేకర్స్ చెప్పనున్నారని తెలుస్తోంది. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారని సమాచారం. మరి చూడాలి ఏం చేస్తారో..

Tags:    
  • NBK109 
  • Nandamuribalakrishna 
  • Bobbykolli 
  • Tollywood 
  • Balakrishna 
  • Nbk109tittle 
  • Filmindustry 
  • Balakrishnanbk109 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS