చిరంజీవి-బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ లేన‌ట్లేనా!

మెగా-నంద‌మూరి కుటుంబాల‌ మ‌ధ్య బాండింగ్ కూటిమి ఏర్పాటుతో ఎంత‌గా బ‌ల‌ప‌డిందో తెలిసిందే.;

Update: 2025-09-27 03:45 GMT

మెగా-నంద‌మూరి కుటుంబాల‌ మ‌ధ్య బాండింగ్ కూటిమి ఏర్పాటుతో ఎంత‌గా బ‌ల‌ప‌డిందో తెలిసిందే. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌ క‌లిసి పోటీ చేయ‌డం..భారీ మెజార్టీతో గెల‌వ‌డంతో కుట‌మికి ఎదురు లేకుండా పోయింది. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న చిన్న‌పాటి వైరాలు సైతం రెండు కుటుంబాల మ‌ధ్య తొల‌గిపోయాయి. రాజ‌కీయాల్లో విమ‌ర్శ లు-ప్ర‌తి మ‌ర్శ‌లు స‌హ‌జం అనుకుని అప్ప‌టి నుంచి క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నారు. నాటి నుంచి రెండు కుటుంబాల మ‌ధ్య ప‌ర్స‌న‌ల్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవ్వ‌డం మొద‌లైంది.

బోయ‌పాటి కి ఛాన్స్ లేన‌ట్లేనా:

మ‌రో 15 ఏళ్ల పాటు టీడీపీకే త‌న మ‌ద్ద‌తు అని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డంతో? ముఖ్య‌మంత్రి నారా చంద్ర బాబు నాయుడుకి ప‌వ‌న్ ఎంత క్లోజ్ అయ్యారు? అన్న‌ది ప్ర‌జ‌ల‌కు అర్ద‌మైంది. ప‌వ‌న్ ఎటు వైపు ఉంటే? మెగా కుటుంబమంతా కూడా ఆయ‌న మాట జ‌వ దాట‌దు. రాజ‌కీయంగా అన్ని ర‌కాలుగా ప‌వ‌న్ కు అండ‌గా నిలుస్తుంది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి-బాల‌కృష్ణ కూడా మ‌రింత క్లోజ్ అయ్యారు. మెగా-నంద‌మూరి అభిమానుల మ‌ద్య ఉండే వైరాలు కూడా తొల‌గిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవినే ముందుకొచ్చి బాల‌కృష్ణ‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ఉంద‌ని...ఆ కాంబినేష‌న్ క‌ల‌పాల్సిన బాద్య‌త ద‌ర్శ‌కుడు బోయ‌పాటి మీద పెట్టారు.

బాల‌య్య వ్యాఖ్య‌ల‌తో గంద‌ర‌గోళం:

ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న బాల‌య్య కూడా ఎంతో సంతోషించారు. సింహం కూడా సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో ఈ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టారర్ ఉంటుంటుంద‌ని నాటి నుంచి ఎప్ప‌టి క‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లోనూ రోజువారి చ‌ర్చ నేప థ్యంలో సాధార‌ణ అంశంగా మారిపోయింది.

దీంతో సినిమా ఖాయ‌మ‌ని అంతా అనుకుంటున్నారు. బోయ‌పాటి త‌లుచుకుంటే 2026లోనే ఆ కాంబోలో సినిమా సాధ్య‌మ‌వుతుంద‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌తో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చిన‌ట్లు అయింది.

పెద్దలు ఎలా భావిస్తారో:

అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి పేరు బాల‌య్య ప్ర‌స్తావ‌నకు తీసుకు రావ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ప్ర‌తిగా చిరంజీవి కూడా తాను చెప్పాల‌నుకున్న‌ది సూటిగా స‌న్నివేశం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇప్పుడిదే టాపిక్ ఫిలిం స‌ర్కిల్స్ స‌హా ప‌రిశ్ర‌మ‌లో వాడి వేడి చ‌ర్చ‌గా మారింది. ఈ స‌న్నివేశం ఇద్ద‌ర్నీ మ‌ళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తుందా? అన్న ఆందోళ‌న అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి సినిమా వేరు-రాజ‌కీయం వేరు అని వాదించే సినీ పెద్ద‌లు ఈ విష‌యాన్ని ఎలా ప‌రిగ‌ణిస్తారు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News