బాలయ్య డెడికేషన్‌కు తమిళ మీడియా ఫిదా

బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు చెన్నైలో ‘అఖండ-2’ ప్రమోషనల్ ప్రెస్ మీట్ జరగాల్సింది. ఆ సమయానికి మీడియా ప్రతినిధులు వేదికకు వచ్చేశారు.;

Update: 2025-12-04 15:30 GMT

పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న తన కొత్త చిత్రం ‘అఖండ-2’ను దేశవ్యాప్తంగా గట్టిగానే ప్రమోట్ చేశాడు నందమూరి బాలకృష్ణ. నార్త్ ఇండియాలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. హిందీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. అలాగే బుధవారం చెన్నైకి వెళ్లి అక్కడో ఈవెంట్లో పాల్గొన్నాడు. చెన్నైలో మీడియాను కలిసిన సందర్భంగా బాలయ్య చూపించిన సింప్లిసిటీకి, డెడికేషన్‌కు అక్కడి వాళ్లు ఫిదా అయిపోయారు. నిన్న రాత్రి నుంచి తమిళ మీడియా ప్రతినిధులు వరుసగా బాలయ్య మీద పోస్టులు పెట్టి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అక్కడ బాలయ్య ఏం చేశాడంటే..?

బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు చెన్నైలో ‘అఖండ-2’ ప్రమోషనల్ ప్రెస్ మీట్ జరగాల్సింది. ఆ సమయానికి మీడియా ప్రతినిధులు వేదికకు వచ్చేశారు. ఐతే ఉదయం బాలయ్య చెన్నైకి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా.. కొన్ని కారణాలతో విమానం ఆలస్యమైంది. ఆయన చెన్నై చేరుకోవడానికి నాలుగు గంటలు ఆలస్యం అయింది. మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఆయన చెన్నైకి చేరుకున్నారు. బాలయ్య వచ్చి ఫ్రెషప్ కావడానికి ఒక హోటల్ గది బుక్ చేశారు. ఆయన కోసం ప్రెస్ ఈవెంట్ దగ్గర ఒక కారవాన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే ఆయన భోజనం చేయాల్సింది.

ఐతే అప్పటికే చాలా ఆలస్యం కావడంతో బాలయ్య హోటల్‌కు వెళ్లలేదు. కారవాన్లోకి వెళ్లి పావుగంట భోజనం చేసి రమ్మన్నా కూడా ఆయన నిరాకరించారట. తన కోసం మీడియా వాళ్లు మూడు గంటలకు పైగా వెయిట్ చేస్తున్నారని చెప్పి.. జస్ట్ ఒక షర్ట్ మార్చుకుని నేరుగా ఈవెంట్‌కు వెళ్లిపోయాడట. దాదాపు రెండు గంటల పాటు ఆ ఈవెంట్ సాగింది. తర్వాత అయినా ఫ్రెషప్ అయి భోజనం చేయమని అడిగితే.. ఐదున్నరకు ఫ్లైట్ ఉందని చెప్పి, అదేమీ వద్దని కారు ఎక్కి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయాడట బాలయ్య. నందమూరి హీరో సింప్లిసిటీ, డెడికేషన్‌కు ఫిదా అయిన తమిళ మీడియా ప్రతినిధులు ఆయన్ని కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News