బాలయ్య బాక్సాఫీస్ గ్రాఫ్ ఎలా ఉందంటే..

ఇప్పుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో 'అఖండ 2' రాబోతోంది. సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండొచ్చు అనే చర్చ ఇప్పుడు మొదలైంది.;

Update: 2025-12-01 17:35 GMT

సినిమా ఫలితం ఎలా ఉన్నా, రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర సందడి చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ లాంటిదని చెప్పవచ్చు. ఇక నందమూరి అభిమానుల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హిట్, ప్లాపుల ప్రభావం ఓపెనింగ్స్ మీద గట్టిగానే పడేది. కానీ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాల ఓపెనింగ్స్ గమనిస్తే, ఆ గ్రాఫ్ క్రమంగా మారుతూ వస్తోంది. కంటెంట్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'అఖండ' తర్వాత ఆయన మార్కెట్ స్థాయి పెరిగిందనేది వాస్తవం.

ఇప్పుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో 'అఖండ 2' రాబోతోంది. సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండొచ్చు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే, ఒక ఆసక్తికరమైన ప్యాట్రన్ కనిపిస్తుంది. సంక్రాంతి పోటీలో విడుదలైన సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే షేర్ రాబట్టాయి.

ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన 'డాకు మహారాజ్', అంతకుముందు వచ్చిన 'వీరసింహారెడ్డి' సినిమాలు పోటీలో ఉండి కూడా మంచి ఓపెనింగ్స్ సాధించాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో, ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంచనా లెక్కలు మాత్రమే. ఇక సినిమా సినిమాకూ పెరుగుతున్న మార్కెట్ రేంజ్ ను ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాల మొదటి రోజు ఏపీ, తెలంగాణ షేర్ల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి:

డాకు మహారాజ్: 25.72 కోట్లు

వీరసింహారెడ్డి: 25.35 కోట్లు

అఖండ: 15.39 కోట్లు

భగవంత్ కేసరి: 14.36 కోట్లు

ఎన్టీఆర్ కథానాయకుడు: 7.6 కోట్లు

రూలర్: 4.25 కోట్లు

ఎన్టీఆర్ మహానాయకుడు: 2.12 కోట్లు

ఈ లిస్ట్ గమనిస్తే, 'రూలర్', 'ఎన్టీఆర్' బయోపిక్స్ సమయంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన ఓపెనింగ్స్, 'అఖండ' తర్వాత డబుల్ డిజిట్ కు చేరాయి. అక్కడి నుంచి 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజ్' సినిమాలతో ఏకంగా 25 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. అంటే కేవలం కొన్ని ఏళ్లలోనే ఓపెనింగ్స్ లెక్క పెరిగిందని అర్థమవుతోంది. మాస్ ఆడియెన్స్ లో ఆయనకున్న పట్టు దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఇప్పుడు రాబోయే 'అఖండ 2' మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ నంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సీక్వెల్ అడ్వాంటేజ్ తో పాటు, బోయపాటి బ్రాండ్ కూడా తోడవుతుంది కాబట్టి, 30 కోట్ల మార్క్ ను టచ్ చేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఏ నంబర్ దగ్గర ఆగుతారో, రికార్డులు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News