అనుకున్నట్లే ట్విస్ట్ ఇచ్చిన అఖండ 2
నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్‌కి కేరాఫ్ అడ్రస్. ఆయన చేసిన ప్రతి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో ఊహించని వాతావరణాన్ని తీసుకొస్తుంది.;
నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్‌కి కేరాఫ్ అడ్రస్. ఆయన చేసిన ప్రతి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో ఊహించని వాతావరణాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అయితే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఈ కాంబినేషన్‌లో వస్తున్న నెక్స్ట్ మూవీ అఖండ 2 - తాండవం.
ప్రేక్షకులంతా సెప్టెంబర్ 25నే ఈ భారీ మాస్ ఫెస్టివల్ థియేటర్లలో చూడబోతున్నామని భావించారు. కానీ మేకర్స్ తాజాగా అధికారికంగా షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. భారీ స్థాయిలో జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్ పూర్తి కావడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు. అందుకే ముందుగా ప్రకటించిన డేట్‌కు రిలీజ్ సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చేశారు.
అఖండ 2 స్థాయి సినిమాను కేవలం పూర్తి చేసి విడుదల చేయడం కంటే, అంచనాలను మించిపోయేలా తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మేకర్స్ వెల్లడించారు. సినిమా స్కేలు, అద్భుతమైన విజువల్స్, బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో భారీ అనుభూతిని ఇవ్వాలని వారు చెబుతున్నారు. అందుకే రిలీజ్ డేట్ వాయిదా వేసి కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం థమన్ అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఇచ్చిన ఎక్స్‌ప్లోసివ్ హిట్స్ ను గుర్తుచేసుకుంటే, ఈ సినిమా కూడా ఆ రేంజ్‌లో హిట్టవ్వడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.
ఇక న్యూ రిలీజ్ డేట్ విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడడంతో ఆ డేట్ ను ఫిక్స్ చేసుకునే అవకాశం ఉందని టాక్. త్వరలోనే న్యూ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.