అఖండ 2 కూడా షిఫ్ట్ అవుతుందా..?

అఖండ 2 సినిమాకు సీజీ వర్క్ కూడా బాగానే ప్లాన్ చేస్తున్నారు. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ని పర్ఫెక్ట్ గా వచ్చేలా చూస్తున్నారట.;

Update: 2025-05-17 03:00 GMT

నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అఖండ 2 సినిమా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో తాండవం చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కాగా ఆ సినిమా హిందీ డబ్బింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈసారి అఖండ 2 సినిమాను డైరెక్ట్ హిందీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

బోయపాటి శ్రీను కూడా అఖండ 2 సినిమా ప్లానింగ్ ని నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే అఖండ 2 సినిమాను అసలైతే దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అలానే షూటింగ్ షెడ్యూల్ చేసుకున్నారు. ఐతే అఖండ 2 సినిమా ఇప్పుడు దసరాకి రావడం కష్టమే అని అంటున్నారు. సినిమా దసరా కల్లా పూర్తి చేయడం కష్టమన్నట్టుగా తెలుస్తుంది.

అఖండ 2 సినిమాకు సీజీ వర్క్ కూడా బాగానే ప్లాన్ చేస్తున్నారు. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ని పర్ఫెక్ట్ గా వచ్చేలా చూస్తున్నారట. అందుకే సినిమా రిలీజ్ లేట్ అయినా పర్వాలేదని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో దసరా అనుకున్న సినిమా కాస్త ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా క్రిస్ మస్ కి రిలీజ్ అనుకుంటున్నారని తెలుస్తుంది. అఖండ సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ ప్రకారంగా కూడా డిసెంబర్ లోనే అఖండ 2 తాండవం రిలీజ్ అనుకుంటున్నారట.

ఈమధ్య వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు బాలకృష్ణ. ఐతే అఖండ 2 సినిమా విషయంలో మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా కంటెంట్ పరంగా కూడా బాగా వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. సో బోయపాటి బాలయ్య ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో మాస్ విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అఖండ 2 హిందీ ఆడియన్స్ కి ఎక్కితే మాత్రం సినిమా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో చేసే సినిమాను కూడా బాలయ్య పాన్ ఇండియా బొమ్మగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా బాలకృష్ణ అఖండ 2 తో పాన్ ఇండియా లెక్క తేల్చబోతున్నారు. ఆ తర్వాత ఆయన కూడా సినిమా అంటే నేషనల్ వైడ్ రిలీజ్ అనేలా ఉన్నారనిపిస్తుంది.

Tags:    

Similar News