కొత్త ట్రెండ్ కోసం రాజమౌళి అదిరిపోయే ప్లాన్
అయితే ఆ టీజర్ కోసం బాహుబలి టీమ్ చాలా భారీ ప్లానే వేసింది. అందులో భాగంగానే వార్2, కూలీ సినిమాలకు ఆ టీజర్ ను ఎటాచ్ చేయబోతున్నారట.;
బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్.. ఈ రెండు సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ బరిలో ఓ ట్రెండ్ ను సెట్ చేశారు రాజమౌళి. ఆ రెండింటిలో మొదటి సినిమా రిలీజై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలి: ది ఎపిక్ పేరుతో రెండు భాగాలను ఓ సినిమాగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసి ఆ మేరకు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఆ సినిమా టీజర్ ఇప్పుడు రెడీ అయింది. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాట్ మూవీ వర్క్స్ ను చూసుకుంటూనే మరోవైపు బాహుబలి: ది ఎపిక్ ఎడిటింగ్ వర్క్స్ ను కూడా చూసుకుంటున్నారు రాజమౌళి. ఇప్పుడా పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే టీజర్ ను కూడా రెడీ చేశారట.
బాహుబలి ది ఎపిక్ టీజర్ కోసం భారీ ప్లాన్
అయితే ఆ టీజర్ కోసం బాహుబలి టీమ్ చాలా భారీ ప్లానే వేసింది. అందులో భాగంగానే వార్2, కూలీ సినిమాలకు ఆ టీజర్ ను ఎటాచ్ చేయబోతున్నారట. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్2 సినిమాకు, రజినీకాంత్- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీ సినిమాకీ భారీ హైప్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలతో ఇప్పుడు బాహుబలి టీజర్ ను ఎటాచ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ రెండు సినిమాలూ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అక్టోబర్ లో రిలీజ్
అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ థియేటర్లలోకి రానుండగా, ఈ సినిమాలో రాజమౌళి ఏయే సీన్స్ ను ఎడిట్ చేశారనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాల విషయంలో ఎప్పుడూ ట్రెండ్ ను సెట్ చేసే రాజమౌళి రీరిలీజ్ ల ట్రెండ్ లో రెండు భాగాలనూ ఒకటిగా రిలీజ్ చేసే కొత్త ట్రెండ్ ను ఇప్పుడు మొదలుపెట్టడంతో బాహుబలి ది ఎపిక్ పై విపరీతమైన క్రేజ్ నెలకొంది.