స్టార్ కపుల్స్ నికర విలువ ఎన్నివందల కోట్లు అంటే?
బాలీవుడ్ సూపర్ జోడీ అమితాబచ్చన్-జయాబచ్చన్ ఆదాయం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే అమితాబ్ చేతినిండా సంపాదన.;
బాలీవుడ్ సూపర్ జోడీ అమితాబచ్చన్-జయాబచ్చన్ ఆదాయం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే అమితాబ్ చేతినిండా సంపాదన. హిందీలోనే కాకుండా తెలుగులో సైతం సినిమాలు చేయడంతో అమితాబ్ ఆదాయం కూడా రెట్టింపు అయింది. బాలీవుడ్ ని మించిన పారితోషికం తెలుగులో ఒక్క గెస్ట్ రోల్ పోషిస్తే వస్తోంది. అటు జయాబచ్చన్ సినిమాలు తక్కువగా చేసినా ఎండార్ మెంట్స్ ద్వారా భారీగా అర్జిస్తున్నారు.
2024 బిజినెస్ టుడే నివేదిక ప్రకారం ఈజోడీ 1,578 కోట్ల రూపాయల నికర విలువను కలిగి ఉన్నారు. అమి తాబ్ అద్దెల రూపంలో, వడ్డీ, డివిడెండ్‌లు, మూలధన లాభాలు, సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా భారీగా ఆదా యం ఖాతాలో జమ అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ వ్యక్తిగత నికర విలువ సుమారు 273.74 కోట్లుగా తెలుస్తోంది. జయ ప్రకటించిన ఆస్తుల విలువ 1.63 కోట్లగా ఉంది. అలాగే 2025-25 ఆర్థిక సంవత్సరంలో అమితాబ్ దాదాపు 350 కోట్ల సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అలాగే భారతదేశంలో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులలో అమితాబ్ ఒకరిగా నిలిచారు. 2024 సియాసత్ నివేదిక ప్రకారం అమితాబ్ కార్ల సేకరణ హైలైట్ అవుతుంది. బెంట్లీ కాంటినెంటల్ జీటీ, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్ బీ డబ్ల్యూ, లెక్సస్ 570, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ జీఎల్ 63 ఏఎమ్ జీ, మెర్సిడెస్-బెంజ్ ఎస్ 350, పోర్స్చే కేమన్ ఎస్, మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్, మినీ కూపర్ ఎస్, వింటేజ్ ఫోర్డ్ కార్లు కలిగి ఉన్నారు.
ప్రతీ కారు అమితాబ్ స్టేటస్ ను హైలైట్ చేస్తుంది. అలాగే ముంబైలోని జుహు లో అమితాబ్ నివసిస్తోన్న ఇంటి విలువ 50 కోట్లు అని తెలుస్తోంది. అమితాబ్- అభిషేక్ బచ్చన్ అదే ప్రాంతంలో సంయుక్తంగా కపోల్ హౌసింగ్ సొసైటీలో 45 కోట్ల విలువైన ప్రోపర్టీ కూడా కలిగి ఉన్నారు. ఇంకా గోరేగావ్‌లోని ఒబెరాయ్ సెవెన్ టవర్స్‌లో ప్రీమియం అపార్ట్‌మెంట్‌లున్నాయి. వీటి ఒకదాని ధర 20 కోట్లు కాగా మరో దాని ధర 9.5 కోట్లగా ఉంది. ఇంకా పేణే సహా విదేశాల్లోనూ అమితాబ్ భారీ గా ఆస్తులు కలిగి ఉన్నట్లు నివేదికలు చెబు తున్నాయి.