• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీ రీమేక్ ఆలోచన...

బేబీ రీమేక్ ఆలోచన మంచిదేనా?

| ఇదే సినిమాని డబ్ చేయడం కాకుండా, మళ్లీ రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. అక్కడి ప్రజలకు నచ్చేవిధంగా కథలో కొన్ని మార్పులు చేసి, వారికి కూడా ఈ బ్లాక్ బస్టర్ ని పరిచయం చేయాలి అని అనుకుంటున్నాడట.

By - Tupaki Desk
Update: 2023-08-29 01:30 GMT

ఈ మధ్యకాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన టాలీవుడ్ మూవీ ల్లో బేబీ ఒకటి. ఈ మూవీ చిన్న సినిమాగా వచ్చి ఊహించని హిట్ అందుకుంది. ఈ మూవీతో డైరెక్టర్ సాయి రాజేష్ తో పాటు హీరో హీరోయిన్లుగా నటించిన ఆనంద్, విరాజ్, వైష్ణవిలకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవికి అయితే, స్టార్ డమ్ వచ్చేసిందనే చెప్పాలి.

సినిమా మొత్తాన్ని వైష్ణవి తన భుజాలపై మోసింది. అందుకే, ఆమెకే ఎక్కువ క్రెడిట్ దక్కింది. ఆనంద్ కూడా ఎమోషనల్ సీన్స్ బాగా పండించాడు. ఇటీవలే ఈ సినిమా ఓటీటీకి రాగా, అక్కడ కూడా అదరగొడుతోంది. అయితే, ఈ మూవికి దక్కిన హిట్ చూసి డైరెక్టర్ సాయి రాజేష్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు.

ఈ క్రమంలో ఆయన ఈ సినిమాని బాలీవుడ్ జనాలకు కూడా పరిచయం చేయాలని అనుకుంటన్నాడని తెలుస్తోంది. ఇదే సినిమాని డబ్ చేయడం కాకుండా, మళ్లీ రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. అక్కడి ప్రజలకు నచ్చేవిధంగా కథలో కొన్ని మార్పులు చేసి, వారికి కూడా ఈ బ్లాక్ బస్టర్ ని పరిచయం చేయాలి అని అనుకుంటున్నాడట.

ఒక భాషలో హిట్ అయిన మూవీని, మరో బాషలోకి తీసుకువెళ్లి హిట్ కొట్టిన దర్శకులు చాలా మందే ఉన్నారు. వారి బాటలో సాయి రాజేష్ కూడా అడుగువేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే సందేహాలు కలుగుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంది, అందుకే క్లిక్ అయ్యింది కానీ, నార్త్ జనాలకు ఇలాంటి కథ నచ్చుతుందనే గ్యారెంటీ ఇవ్వలేం. ఇలాంటి కథలు వారు గతంలోనే చూసి ఉండొచ్చు కూడా.

మరీ ముఖ్యంగా ఈ మూవీ క్లిక్ అవ్వడానికి వైష్ణవి ఒక కారణం. ఆమె నటన, తెలుగు అమ్మాయి అవ్వడం లాంటివి కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ మ్యాజిక్ రీమేక్ మూవీకి వర్కౌట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మరి ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా అనే భావన కలుగుతోంది. ఇవన్నీ ఆలోచించుకొని, ముందుకు అడుగు వేయడం మంచిది. ఇక, ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించగా, అది కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యింది.

Tags:    
  • Tollywood 
  • Babymovie 
  • Vaishnavichaitanya 
  • Anandevarkonda 
  • Viraj 
  • Sairajesh 
  • Skn 
  • Ott 
  • Remake 
  • Bollywood 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS