బేబీ తప్పులు సరిదిద్దుకుంటున్న డైరెక్టర్..!
సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ బేబీ. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.;
సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ బేబీ. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఇప్పుడు ఆ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్ ని కూడా సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్నారు. బేబీ హిందీ రీమేక్ అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ తెర వెనుక ఏం జరుగుతుంది అన్నది బయటకు రాలేదు. రీసెంట్ గా బేబీ హిందీ రీమేక్ పై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్.
బేబీ రీమేక్ పై కూడా ఎక్స్ క్లూజివ్ అప్డేట్..
రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్ వేడుకల్లో పాల్గొన్న ఆయన స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా బేబీ రీమేక్ పై కూడా ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చారు. బేబీ సినిమా వర్క్ నడుస్తుందని.. సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేసి 2026 మధ్యలో రిలీజ్ చేస్తామని అన్నారు. బేబీ హిందీ వెర్షన్ లో కొన్ని మార్పులు చేస్తున్నామని.. తెలుగులో సినిమా చూశాక కొందరు చెప్పిన అభిప్రాయాలను తీసుకుని హిందీ రీమేక్ లో అవి ఛేంజ్ చేస్తున్నా అని అన్నారు సాయి రాజేష్.
బేబీ సినిమాలో తాను చేసిన కొన్ని మిస్టేక్స్ ని హిందీ రీమేక్ లో సరిదిద్దుకుంటున్నా అని అన్నారు సాయి రాజేష్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఇద్దరు కూడా సినిమాలో ది బెస్ట్ ఇచ్చారు. ఐతే బేబీ హిందీ రీమేక్ లో బబిల్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు అతను. ఐతే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా ఎవరు చేస్తున్నారన్నది ఇంకా బయటకు రాలేదు.
తెలుగులో సక్సెస్ హిందీలో రీమేక్..
బేబీ హిందీ రీమేక్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందీలో ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నది చూడాలి. బేబీ సినిమా హిందీ రీమేక్ సక్సెస్ అయితే కచ్చితంగా మరికొన్ని చిన్న సినిమాలు ఏవైతే తెలుగులో సక్సెస్ అయ్యాయో వాటిని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బేబీ రీమేక్ డిసెంబర్ నాటికి పూర్తి చేసి 2026 లో రిలీజ్ చేస్తామని సాయి రాజేష్ అంటున్నారు.
బేబీ హిందీ రిలీజ్ తర్వాతే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ చేస్తే కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులు అవుతున్నాయి. మరి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బేబీ హిందీలో ఏమేరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.