బాబిల్ ఖాన్ పై సాయి రాజేష్ ఫైర్

బాలీవుడ్ యాక్ట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ పేరు ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది.;

Update: 2025-05-05 12:06 GMT

బాలీవుడ్ యాక్ట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ పేరు ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. బాలీవుడ్ తీరుపై రీసెంట్ గా అత‌ను మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇండ‌స్ట్రీలో అర్జున్, అన‌న్య‌, ష‌న‌యాతో పాటూ ఇండ‌స్ట్రీకి సంబంధం లేకుండా బ‌య‌ట నుంచి వ‌చ్చిన అర్జిత్ సింగ్ లాంటి వారు కూడా ఎంతోమంది ఉన్నార‌ని అన్నాడు.

సినీ ఇండ‌స్ట్రీ చాలా అమర్యాద‌క‌రంగా ఉంటుంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు తాను చూసిన వాటిల్లో న‌కిలీ ఇండ‌స్ట్రీ ఇదేన‌ని, ఇండ‌స్ట్రీ బావుండాల‌ని కోరుకునే వారు కొంత‌మంది మాత్ర‌మే ఉన్నార‌ని ఓ వీడియో చేసి దాన్ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ కాసేప‌టికే ఆ వీడియోను డిలీట్ చేశాడు బాబిల్ ఖాన్. దీనిపై అత‌ని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

బాబిల్‌ను అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని, ఆ వీడియోలో ఉన్న న‌టీన‌టులంద‌రి నుంచి అత‌ను స్పూర్తి పొందాడ‌ని ఓ యాడ్లో వెల్ల‌డించారు. బాబిల్ ఖాన్ టీమ్ ఇచ్చిన క్లారిటీపై తెలుగు డైరెక్ట‌ర్ సాయి రాజేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. మీరేం చెప్పినా ఏం మాట్లాడ‌కుండా కూర్చోడానికి మేమేమైనా పిచ్చోళ్ల‌లాగా క‌నిపిస్తున్నామా? వీడియోలో అత‌ను ప్ర‌స్తావించిన వాళ్లు మాత్ర‌మే మంచోళ్లు అయితే, ఇంత‌కాలం అత‌నికి స‌పోర్ట్ గా నిలిచిన మేమంతా పిచ్చోళ్ల‌మా? ఓ గంట ముందు వ‌ర‌కూ కూడా అత‌నికి స‌పోర్ట్ గా నిల‌వాల‌నుకున్నా. ఇప్పుడు మీ తీరు చూశాక ఇక్క‌డితో ఆగిపోవ‌డం మంచిద‌నిపిస్తుంద‌ని, ఈ సానుభూతి ఆట‌లు ఇక‌పై ప‌నిచేయ‌వ‌ని, మీరు నిజాయితీతో సారీ చెప్పాల్సిన అవ‌స‌రముంద‌ని రాసుకొచ్చారు.

దీనిపై బాబిల్ ఖాన్ స్పందిస్తూ, మీరు నా మ‌న‌సుని ముక్క‌లు చేశారు. మీ కోసం నెనెంతో శ్ర‌మించా. మీ సినిమాలోని క్యారెక్ట‌ర్ కు న్యాయం చేయ‌డానికి రెండేళ్లు క‌ష్ట‌ప‌డటంతో పాటూ ఇత‌ర అవ‌కాశాల‌ను కూడా వ‌దులుకున్నా అని పోస్ట్ చేశాడు. ఈ రెండు పోస్ట్‌లూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవడంతో ఇద్ద‌రూ త‌మ పోస్ట్‌ల‌ను డిలీట్ చేశారు. బేబీతో హిట్ అందుకున్న సాయి రాజేష్ ఆ సినిమాను హిందీలో తీయాల‌ని ప్లాన్ చేస్తుండ‌గా ఆ సినిమాలో బాబిల్ ను హీరోగా సెలెక్ట్ చేయ‌నున్నార‌ని గ‌త కొన్నాళ్లుగా వార్త‌లొస్తున్నాయి.

Tags:    

Similar News