• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లిలో బాబాయ్- అబ్బాయ్...

పెళ్లిలో బాబాయ్- అబ్బాయ్ ఏంటా చిలిపి?

| పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ ఇద్ద‌రూ పెళ్లిలో ఇలా స‌ర‌దాగా మాట్లాడుకుంటూ జాలీగా క‌నిపించారు. ఇది చాలా అరుదైన దృశ్యం. మెగాభిమానులు దీనిని సోష‌ల్ మీడియాల్లో చిల్లింగ్ గా షేర్ చేస్తూ బోలెడంత సంద‌డి చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-02 15:53 GMT

వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి జంట వివాహ ప్ర‌మాణాల‌తో ఒక‌ట‌య్యారు. ఈ పెళ్లిలో మెగా హీరోల సంద‌డి అంతా ఇంతా కాదు. నాలుగు రోజుల డెస్టినేష‌న్ వెడ్డింగ్ నుండి చాలా ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. ఇప్పుడు ఈ పెళ్లి నుండి బాబాయ్- అబ్బాయ్ రేర్ క్లిక్ ఒక‌టి విడుద‌లైంది. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ ఇద్ద‌రూ పెళ్లిలో ఇలా స‌ర‌దాగా మాట్లాడుకుంటూ జాలీగా క‌నిపించారు. ఇది చాలా అరుదైన దృశ్యం. మెగాభిమానులు దీనిని సోష‌ల్ మీడియాల్లో చిల్లింగ్ గా షేర్ చేస్తూ బోలెడంత సంద‌డి చేస్తున్నారు.


ఆస‌క్తిక‌రంగా ఈ ఫోటోని ప‌రిశీలిస్తే, అస‌లు పెళ్లి వేడుక‌కు జ‌బ‌ర్ధ‌స్త్ గా మేక‌ప్ అవ్వాల‌ని భావించే చాలామందికి క‌నువిప్పుగా క‌నిపించింది. అస‌లు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డా పెళ్లికోసం ప్ర‌త్యేకించి ప్రిప‌రేష‌న్ (మేక‌ప్, కాస్ట్యూమ్స్ వ‌గైరా) చేసాడ‌ని అనిపించ‌దు. అత‌డు చాలా సింపుల్ గా క్యాజువ‌ల్ లుక్ లో పెళ్లి ఆద్యంతం సంద‌డి చేసాడు. పైగా అత‌డు ఒకే త‌ర‌హా టీష‌ర్ట్.. ఫ్యాంటుతోనే ఈ పెళ్లి ఆద్యంతం క‌నిపిస్తున్నాడు. తాజా ఫోటోగ్రాఫ్ లో అద‌నంగా ఒక న‌ల్ల‌ని కోట్ ధ‌రించాడు. ఇది కూడా అక్క‌డ రాత్రి వేళ చ‌లిని త‌ట్టుకునేందుకు తొడిగిన‌ది అని అర్థ‌మ‌వుతోంది. ఇక రామ్ చ‌ర‌ణ్ కూడా బాబాయ్ కి త‌గ్గ‌ట్టే చాలా సింపుల్ గా క‌నిపిస్తున్నాడు. అత‌డు వైట్ అండ్ వైట్ లో కొంత పెళ్లి వైబ్ ని తెచ్చాడు కానీ సింప్లిసిటీ ఈజ్ బెస్ట్ అనే ఫార్ములాను విడిచిపెట్ట‌లేదు. ప‌వ‌న్ - చ‌ర‌ణ్ అలా జాలీగా న‌వ్వుకుంటూ పెళ్లి తంతును ఆస్వాధించ‌డం అభిమానుల‌కు ఆస‌క్తిని క‌లిగించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ఈ పెళ్లిలో ఇద్దరు సూప‌ర్ స్టార్లు చాలా సాధారణ దుస్తులను ధరించారు. మిగతా అందరూ సందర్భానుసారంగా చాలా వెరైటీ దుస్తులు ధరించి కనిపించారు. కానీ ఈ ఇద్ద‌రూ రొటీన్ గానే స‌హ‌జంగా క‌నిపించారు. ఇద్దరూ సాధారణ లుక్స్‌తో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చూపరుల దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షించారు.

ఇంతకుముందు ఈ పెళ్లి నుంచి చాలా ఫోటోలు సోషల్ మీడియాల్లోకి వచ్చాయి, ఒకటి కొణిదెల్ సోదరులు వారి భార్యలతో వేదిక వద్ద కలిసి పోజులిచ్చారు. చిరంజీవి, నాగ బాబు, పవన్ కళ్యాణ్‌లను వారి భార్యలు సురేఖ, పద్మజ, అన్నా లెజ్నెవాతో పాటు కుటుంబంలోని ఇతర పెద్దలతో ఒకే ఫ్రేమ్ లో క‌నిపించారు.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇటలీలోని టస్కానీలో తమ సన్నిహితులు - కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం నవంబర్ 1న జరిగినప్పటికీ వేడుకలు అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో పాటు విస్తృతమైన హల్దీ- మెహందీ ఆచారాలతో ప్రారంభమయ్యాయి.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నెక్ట్స్ ఏంటి?

ఆ ఇద్ద‌రూ ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాల రాక కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. SS రాజమౌళి చిత్రం RRR లో చివరిగా కనిపించిన రామ్ చరణ్ తదుపరి S శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రంతో థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ దీపావళికి విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న‌ OG చిత్రంలో కనిపించనున్నాడు. ఇందులో క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాడు. హరి హర వీర మల్లు - ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ చిత్రాల్లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Varunlavwedding 
  • Varuntej 
  • Lavanayatripati 
  • Megapowerstar 
  • Ramcharan 
  • Powerstar 
  • Pawankalyan 
  • Viralpic 
  • Italy 
  • Stylishlooks 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS