'ది ఎపిక్' లో జ‌క్క‌న్న కొత్త‌గా ఏం చెప్ప‌బోతున్నారు?

రాజ‌మౌళి ఆ ర‌కంగానే `ది ఎపిక్` ని సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే భారీ బ‌జ్ క్రియేట్ అవుతెన్న నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఎపిక్ ప్ర‌చారం పీక్స్ కు చేరితో?;

Update: 2025-08-23 15:22 GMT

పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించిన` బాహుబ‌లి` ది బిగినింగ్, క‌న్ క్లూజ‌న్ రెండు భాగాలు క‌లిపి `ది ఎపిక్` గా రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 31న గ్రాండ్ గా ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ అవు తుంది. రెండు భాగాలు క‌లిపి రీ రిలీజ్ అయినా? ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. బుక్ మై షోలో ఇప్పటి వరకు 140,000 కంటే ఎక్కువ మంది ఆసక్తి చూపించ‌డం క్లియ‌ర్ గా తెలుస్తోంది. ఇంకా వివిధ ప్లాట్ ఫామ్స్ లో మ‌రింత మంది ఎపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

రెండు భాగాలు క‌లిపి ప‌ద‌కొండు గంట‌ల పుటేజ్ ఉంది. ఇది గాక డ్యూరేష‌న్ ఎక్కువైనా కార‌ణంగా మరి కొంత పుటేజ్ అప్పుడే తొల‌గించారు. దీంతో `ది ఎపిక్` కోసం సిద్దం చేయాల్సిన భాగం రాజ‌మౌళికి పెద్ద స‌వాల్ గా మారింది. రెండు భాగాల‌తో అద‌నంగా ఉన్న పుటేజ్ ని కూడా ట్రిమ్ చేసి స్పార్ప్ కంటెంట్ ని అందించాలి. అందుకోసం రాజ‌మౌళి ఎడిటింగ్ టేబుల్ పై మ‌రింత‌గా ప‌ని చేస్తున్నారు. ప్రేక్ష‌కుడికి ప్రెష్ ఫీల్ క‌ల‌గాలంటే? చూపించిన భాగం కంటే చూపించ‌ని భాగాన్ని చూపిస్తే? ఆడియ‌న్స్ కొత్త అనుభూతి దొరుకుతుంది.

రాజ‌మౌళి ఆ ర‌కంగానే `ది ఎపిక్` ని సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే భారీ బ‌జ్ క్రియేట్ అవుతెన్న నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఎపిక్ ప్ర‌చారం పీక్స్ కు చేరితో? అంచ‌నాలు మ‌రింత రెట్టింపు అవుతాయి. ప్ర‌చారానికి సంబంధించి రాజ‌మౌళి స్ట్రాట‌జీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ది ఎపిక్ ను కూడా అలాగే క‌నెక్ట్ చేసే అవ‌కాశం ఉంది. జ‌క్క‌న్న ఓ వైపు ఎస్ ఎస్ ఎంబీ 29 ప‌నులు బిజీగా ఉంటూనే ది ఎపిక్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

అక్టోబ‌ర్ రెండ‌వ వారం నుంచి రిలీజ్ వ‌ర‌కూ రాజ‌మౌళి `బాహుబ‌లి `ది ఎపిక్` ప‌నుల్లోనే బిజీగా ఉంటార‌ని తెలిసింది. అంత‌ర్జాతీయంగా కూడా చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. అదే జ‌రిగితే విదే శాల్లో కూడా జ‌క్క‌న్న ప్ర‌చారం చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్ర‌చారంలో ప్ర‌భాస్ పాల్గొంటాడా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం ఆయ‌న `రాజాసాబ్`, `పౌజీ` చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News