జనాలను హింసిస్తున్న కాపీ మూవీ.. ఎన్నిసార్లు చూపిస్తారయ్యా?
కాలం మారే కొద్దీ ఆడియన్స్ లో కూడా సినిమా పట్ల అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి అని దర్శకనిర్మాతలకు ఎంతోమంది సలహాలు ఇస్తున్నారు.;
కాలం మారే కొద్దీ ఆడియన్స్ లో కూడా సినిమా పట్ల అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి అని దర్శకనిర్మాతలకు ఎంతోమంది సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా ఒక్క చిన్న బిట్ కాపీ అనిపించినా సరే సినిమా మొత్తం కాపీ అంటూ పెద్ద ఎత్తున్న సినీ లవర్స్ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. అందుకే కథ, కంటెంట్ మాత్రమే కాదు అటు మ్యూజిక్, బిజిఎం ఇలా ప్రతి విషయంలో కూడా సరికొత్తగా ఉండాలని చూస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి అనూహ్యంగా చేసే పనుల వల్ల కాపీ ముద్ర పడడం పక్కన పెడితే.. ఆ సినిమాలు ప్రేక్షకులను హింసిస్తాయి అని కూడా చెప్పవచ్చు. తాజాగా ఇప్పుడు అలాంటి సినిమానే ప్రేక్షకులను హింసిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆ చిత్రం ఏదో కాదు భాగీ 4. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మాస్ ఆడియన్స్ లో ఈ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. అటు పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ లో కూడా మొదటి రోజుకు ముందే లక్ష టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. పైగా గోపీచంద్ హీరోగా వచ్చిన 'భీమా' సినిమా దర్శకుడు హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాదు కన్నడ దర్శకుడైన ఈయనకు ఈ సినిమా హిందీ డెబ్యూ కావడం.. ఇలా భారీ హైప్ తో వచ్చిన ఈ చిత్రం మీద ఇప్పుడు హిందీ రివ్యూయర్లు విరుచుకుపడుతున్నారు.
ఈ మధ్యకాలంలో అత్యంత దారుణంగా టార్చర్ పెట్టిన సినిమాగా నిలిచింది అంటూ ఒకటి రేటింగ్ ఇచ్చి చెడుగుడు ఆడేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒరిజినల్ కథ కాదు.. 2019లో 'ప్రేమిస్తే' మూవీ భరత్ హీరోగా వచ్చిన 'అయింతు అయింతు అయింతు' అనే సినిమాకి కాపీ అని చెప్పవచ్చు. అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న భరత్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది. అంతేకాదు ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కూడా నిలిచింది. ఇప్పుడు ఆ పాయింట్ ని సేమ్ టు సేమ్ ఈ 'భాగీ 4' లో వాడుకున్నారు. 7 నెలలు కోమాలో ఉండి .. దాని నుంచి బయటకు వచ్చిన హీరో టైగర్ ష్రాఫ్ గతాన్ని మరిచిపోతాడు. లేని ప్రేయసిని ఊహించుకుంటూ వింతగా ప్రవర్తిస్తాడు. అప్పుడే విలన్ సంజయ్ దత్ ఎంట్రీ ఇస్తారు. అసలు టైగర్ ష్రాఫ్ జీవితంలో ఏం జరిగింది? ఎవరు ఇదంతా చేశారు? అనేది మనం చాలా సులభంగా ఊహించవచ్చు.
నిజానికి ఇలా హాస్పిటల్ బెడ్ నుంచి హఠాత్తుగా లేచి గతాన్ని వాడుకోవడం అనే పాయింట్ గతంలో ఎంతో మంది హీరోలు వాడారు. బాలకృష్ణ లయన్, గోపీచంద్ ఒంటరి వంటి చిత్రాలలో సేమ్ ఎపిసోడ్ రిపీట్ అయింది. కానీ అవి డిజాస్టర్ గానే నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమా అందరూ ఊహించదగినదిగానే ఉంది అని, డైరెక్టర్ భరించరాని హింసను చూపించి, థియేటర్లో జనాలను హింసించేశారు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. పైగా హీరోయిన్ కోసం హీరో చేసే స్టంట్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ మరింత చెత్తగా అనిపిస్తుంది. దీనికి తోడు పాటలు కూడా విసుగు తెప్పిస్తాయి. మంచి యాక్టర్లు ఉన్నప్పటికీ వారికి ఇచ్చిన పాత్రలు ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు.
అసలు హీరోయిన్ పాత్ర ఎందుకు వస్తుందో తెలియదు.. ఎందుకు పోతుందో కూడా తెలియదు.. ఇక ప్రీ క్లైమాక్స్ విషయానికి వస్తే నరకం అనే చెప్పాలి. కేవలం హెవీ ఆక్షన్ డోస్, ఒక లవ్ ట్రాక్ తో నెట్టుకు రావాలని మేకర్స్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా బాలీవుడ్లో బిగ్ ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైన ఈ సినిమా ఇలా చెత్త రికార్డును మొదటి రోజే క్రియేట్ చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి చెత్త కంటెంట్ ను ఎన్నిసార్లు చూపిస్తారయ్యా అంటూ మండిపడుతున్నారు. ఇక ఇందులో టైగర్స్ ష్రాఫ్ ,హరినాథ్ గౌడ్, సోనం బజ్వా, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాజిద్ నడియాద్వాల నిర్మాతగా వ్యవహరించగా.. సంచిత బల్హార, అంకిత బల్హార సంగీతాన్ని అందించారు.