టాప్ లేపేసిన అవ్‌నీత్.. లోన దాగిన టాటూ సొగ‌సు

అవ్ నీత్ కౌర్.. ట్రెండీ ఫ్యాష‌న్ సెన్స్ తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెడుతున్న బ్యూటీ. ఈ ఉత్త‌రాది భామ నిరంత‌ర ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.;

Update: 2025-12-01 20:30 GMT

అవ్ నీత్ కౌర్.. ట్రెండీ ఫ్యాష‌న్ సెన్స్ తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెడుతున్న బ్యూటీ. ఈ ఉత్త‌రాది భామ నిరంత‌ర ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే నవ్ నీత్ స్టైల్ స్టేట్ మెంట్ల‌కు ప్ర‌శంస‌ల‌తో పాటు, ఒక సెక్షన్ నెటిజ‌నుల్లో విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కార‌ణం అన్ లిమిటెడ్ బో* ట్రీట్.



 


అవ్ నీత్ మ‌రోసారి లేటెస్ట్ ఫోటోషూట్ తో గుబులు రేపుతోంది. స్టైలిష్‌ బ్లూ డెనిమ్స్ - వైట్ టాప్ ధ‌రించిన ఈ కుర్ర‌బ్యూటీ టాప్ లేపేసింద‌ని చెప్పాలి. ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ లుక్ కి త‌గ్గ‌ట్టుగానే అదిరిపోయే గ్రే క‌ల‌ర్ గ్లాసెస్ ని ధ‌రించిన అవ్ నీత్ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ఇదేకాదు.. అవ్‌నీత్ త‌న స‌న్న‌జాజి న‌డుము సొగ‌సును, ఎద అందాల దిగువ‌న ఉన్న టాట్టూను అందంగా ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ బ్యూటీ నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది.



 


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, అవ్ నీత్ బుల్లితెర‌ నుంచి సినీరంగంలో ప్ర‌వేశించింది. కౌర్ `మర్దానీ`లో మీరా పాత్ర‌తో `టికు వెడ్స్ షేరు`లో టికు పాత్రలతో పాపుల‌రైంది. చంద్ర నందినిలో చారుమతి, అలాద్దీన్‌లో యాస్మిన్ - నామ్ తో సునా హోగా చిత్రాల్లో పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంది. అవ్ నీత్ కౌర్ 2010లో జీ టీవీ డ్యాన్స్ షో డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్‌తో తన వృత్తిని ప్రారంభించింది. అవ్ నీత్ సెమీ-ఫైనల్‌కు ముందే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్‌లో పాల్గొంది. ఈ వేదిక‌లో ఆమె `డ్యాన్స్ ఛాలెంజర్స్` బృందంలో చేరింది. కౌర్ 2012లో లైఫ్ ఓకే మేరీ మాతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె జిల్మిల్ పాత్రను పోషించింది. ఆ తర్వాత SAB టీవీ తేధే హై పర్ తేరే మేరే హైన్‌లో నటించింది. 2012లో, కలర్స్ టీవీ సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది, అక్కడ ఆమె దర్శీల్ సఫారీతో పోటీ పడింది. ఈ షోలో కనిపించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డుల‌కెక్కింది.



 


ఆ త‌ర్వాత `లైఫ్ ఓకే`లో సావిత్రి - ఏక్ ప్రేమ్ కహానీలో నటించింది. అందులో రాజకుమారి దమయంతి పాత్ర పోషించింది. ఆగస్ట్ 2013లో కౌర్ జీ టీవీ `ఏక్ ముత్తి ఆస్మాన్‌`లో పాఖీ పాత్ర పోషించింది. కౌర్ 2014లో ప్రదీప్ సర్కార్ మర్దానితో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. ఆమె సన్నీ సింగ్ సరసన `లవ్ కి అరేంజ్ మ్యారేజ్‌`లో కూడా నటించింది.



 


Tags:    

Similar News