పొగుడుతూనే.. ఇచ్చిపడేసిన చిన్నారి పెళ్లి కూతురు!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అవికా గోర్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.

Update: 2026-05-23 05:37 GMT

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అవికా గోర్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా కంటే.. తనపై వచ్చిన ఓ షాకింగ్ రూమర్ గురించి చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. తనపై వచ్చిన గాసిప్‌ ను తిట్టకుండా.. దాన్ని రాసిన వాళ్ల క్రియేటివిటీని మెచ్చుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అవికా నటించిన అగ్లీ స్టోరీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందు హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహించాడు. ఆ మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా అవికా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తాను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై వచ్చిన ఒక రూమర్ గురించి చెప్పిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

18 ఇయర్స్ వయసులో తనకు 32 ఏళ్ల యాక్టర్ తో ఏకంగా అఫైర్ ఉందని రాశారని గుర్తు చేసుకున్నారు. 'అంతేకాదు.. మేమిద్దరం సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నామని చెప్పారు. ఆ బిడ్డను అందరికీ దాచిపెట్టారని కథ కూడా యాడ్ చేశారు ' అంటూ నవ్వుతూ తెలిపారు. ఆ రూమర్ చదివినప్పుడు తాను షాక్ అయ్యానని.. కానీ అదే సమయంలో క్రియేటివ్‌ గా మాత్రం అనిపించిందని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. "ఆ నటుడితో నేను ఎప్పుడు లవ్ లో పడ్డానో నాకే తెలియదు. మేమిద్దరం కలిసి పని చేశాం అంతే. కానీ వాళ్లు మాత్రం పూర్తి లవ్ స్టోరీ తయారు చేశారు. పైగా బిడ్డను కూడా యాడ్ చేశారు. అసలు ఏ లెవెల్‌లో ఆలోచించారో అర్థం కాలేదు. అలా రాసేవాళ్లు సినిమాలకు కథలు రాస్తే బాగుంటుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. సాధారణంగా హీరోయిన్లు రూమర్స్‌ పై అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ అవికా మాత్రం పొగుడుతూనే ఇచ్చి పడేసినట్లు అర్థమవుతోంది.

ఇక వ్యక్తిగత జీవితంపై కూడా అవికా కొన్ని విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ లో ఉంటోందని తెలిపారు. తన భర్త అక్కడ ప్రముఖ ట్రావెల్ కంపెనీలో ఉన్నత పదవిలో పనిచేస్తున్నారని చెప్పిన అవికా.. కెరీర్ దృష్ట్యా బ్యాంకాక్‌ లో ఉండటం మంచిదని భావించి.. ఇండియా వదిలి అక్కడికి షిఫ్ట్ అయినట్లు వివరించారు. ఇప్పటికే బ్యాంకాక్‌లో ఓ ఇల్లు కూడా కొనుగోలు చేశామని, ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయని.. అందుకే తాత్కాలికంగా ఓ అపార్ట్మెంట్‌ లో ఉంటున్నామని చెప్పారు.

త్వరలోనే కొత్త ఇంట్లోకి మారిన తర్వాత హౌస్ టూర్ వీడియోను యూట్యూబ్‌ లో షేర్ చేస్తానని వెల్లడించారు. అయితే థాయ్‌ లాండ్‌ కు షిఫ్ట్ అయినా.. సినిమాలకు మాత్రం దూరం కాదని స్పష్టం చేశారు అవికా. షూటింగ్స్ కోసం తరచూ ఇండియాకు వస్తుంటానని, కొన్ని రోజుల పాటు వర్క్ చేసి.. వీకెండ్‌ లో మళ్లీ బ్యాంకాక్ వెళ్తానని తెలిపింది. మొత్తానికి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అవికా.. ఇప్పుడు తన కెరీర్, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News