• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంగేజ్మెంట్ చేసుకున్న...

ఎంగేజ్మెంట్ చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. పిక్స్ చూశారా?

| అలా పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చిన అవికా గోర్.. తాజాగా మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం జరిగిన పిక్స్ ను షేర్ చేసింది.

By - Tupaki Desk
Update: 2025-06-11 19:21 GMT

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చిన్న వయసులోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్. హిందీ సీరియల్ తో వచ్చిన గుర్తింపుతో టీనేజ్ లో ఉన్నప్పుడే హీరోయిన్ గా మారింది. అది కూడా టాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది.

 

అదే సమయంలో అమ్మడు కొంతకాలంగా మిలింద్ చాంద్వాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడిని, వాళ్ల పేరెంట్స్ ను పరిచయం చేసింది అవిక. ఆ మధ్య తనకు పెళ్లయిపోయిందని వచ్చిన వార్తలపై రెస్పాండ్ అయ్యి.. బ్రెయిన్ లో ఎప్పుడో పెళ్లయిపోయిందని, కానీ బయట ఇంకా అవ్వలేదని చెప్పింది.

అలా పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చిన అవికా గోర్.. తాజాగా మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం జరిగిన పిక్స్ ను షేర్ చేసింది. అందులో ప్యేస్టల్ కలర్ శారీలో ఉన్న అమ్మడు.. చాలా క్యూట్ గా ఉందని చెప్పాలి. ఆమె నవ్వు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారగా.. అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.

అయితే ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేస్తూ లాంగ్ నోట్ ను రాసుకొచ్చింది అవిక. "ఆయన అడిగారు.. నేను నవ్వాను.. నేను ఏడ్చాను.. అవును అని అరిచాను.. నేను పూర్తిగా మూవీ లవర్ ను.. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, స్లో-మో కలలు, మస్కారా రన్నింగ్.. అతడు చాలా కామ్. నేనే డ్రామా చేస్తా.. ఆయన మేనేజ్ చేస్తారు" అని చెప్పింది.

"ఏదో విధంగా మేం సెట్టవుతాం. నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ, అది మ్యాజిక్" అని తెలిపింది. కాగా, హైదరాబాద్‌ లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికను మిలింద్ తొలిసారి కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారారు. ప్రేమ పుట్టాక.. దాదాపు ఐదు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారు.

ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. త్వరలోనే అవిక, మిలింద్ వివాహం జరగనుందని సమాచారం. అందుకు గాను ఇరువురి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లికి సంబంధించిన ప్రకటన ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మిలింద్ ఇంజినీర్ అని సమాచారం. ఎనీ వే కంగ్రాట్స్ మిలింద్- అవిక.

Tags:    
  • AvikaGor 
  • MilindChandwani 
  • AvikaMilind 
  • Engaged 
  • BalikaVadhu 
  • TVCelebs 
  • IndianCeleb 
  • AvikaGorEngagement 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS