ప్రెగ్నెంట్ పుకార్లకు చెక్ పెట్టిన అవికాగోర్..
అవికా గోర్.. ఈ పేరు పెద్దగా తెలియకపోయినా చిన్నారి పెళ్లికూతురు అని చెప్పగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు.;
అవికా గోర్.. ఈ పేరు పెద్దగా తెలియకపోయినా చిన్నారి పెళ్లికూతురు అని చెప్పగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. 'బాలికా వధు' అనే పేరుతో హిందీలో మొదలైన ఈ సీరియల్.. తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' గా వచ్చి ఏకంగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో చిన్నారి పెళ్లికూతురు గెటప్ లో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది అవికా గోర్. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ఈ చిన్నది.. 2013లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అవికా గోర్.
ఈ సినిమా తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, టెన్త్ క్లాస్ డైరీస్ , షణ్ముఖ, రాజు గారి గది 3 వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే తన అందంతోనే కాదు నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈమె వరసగా ఓటీటీ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే హైదరాబాదులో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ప్రముఖ ఎంటర్ ప్రేన్యూర్ మిలింద్ చాద్వానీతో 2020లో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ప్రేమగా మారింది. ఇక 2025 జూన్లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తనను ఎంతగానో ఆదరించిన బుల్లితెర ఆడియన్స్ సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈమె.. అందులో భాగంగానే పతీ పత్నీ ఔర్ పంగా అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకుంది.
ఇదిలా ఉండగా పెళ్లయిన మూడు నెలలకే ఈమె గర్భవతి అయ్యింది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు రావడానికి కారణం ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక వీడియో విడుదల చేశారు. అందులో "త్వరలోనే కొత్త ప్రయాణం మొదలుకానందుని" ప్రకటించారు. అందులో అవికా మాట్లాడుతూ.." చాలా పెద్ద విషయం రాబోతోంది" అని చెప్పింది. దీంతో నెటిజన్స్ అందరు ఈమె గర్భవతి కాబోతోంది అని ఊహించుకొని శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. ఇటు ఈ పుకార్లకు వీరిద్దరు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఇవి మరింత వ్యాపించాయి.
ఇకపోతే ఈ వార్తలు దావాణంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.." నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అలాంటి విషయం ఏమీ లేదు." అని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే అభిమానులు తొందరపడి తప్పుడు నిర్ణయాలకు వచ్చారని కూడా కామెంట్ చేసింది. ఏది ఏమైనా ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అవికా గోర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.