గేట్ కీపర్ నుంచి 87 చిత్రాల నిర్మాతగా!
అట్లూరి పూర్ణచంద్రరావు ఈ పేరు ఈతరానికి తెలియకపోవచ్చు. కానీ ఆయన తీసిన క్లాసిక్ చిత్రాలు మాత్రం భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్ర పుట్టల్లో నిలిచిపోయేవి.;
అట్లూరి పూర్ణచంద్రరావు ఈ పేరు ఈతరానికి తెలియకపోవచ్చు. కానీ ఆయన తీసిన క్లాసిక్ చిత్రాలు మాత్రం భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్ర పుట్టల్లో నిలిచిపోయేవి. 'మాతృదేవత', 'కొత్తూరు కోడలు', ' స్త్రీ', లాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు తీసారు. తర్వాత తరం హీరోలతోనూ కొన్ని సినిమాలు నిర్మించారు. రవితేజ 'వెంకీ', అజిత్ తో 'ప్రేమ పుస్తకం', 'శైలజా కృష్ణమూర్తి', `ఔనన్నా కాదన్నా` లాంటి చిత్రా లు పూర్ణచంద్రరావు నిర్మించారు.
హిందీలో కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. 1936 లో జన్మించిన పూర్ణచంద్రరావు 1952లో కెరియర్ మొదుల పెట్టారు. ఇప్పుడాయన వయసు 90 ఏళ్లు. 87 సినిమాలు నిర్మించారు. ఇటీవలే తెలంగాణ పభుత్వం గదర్ అవార్డు కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఆయన అనుభవాలు చెప్పుకొచ్చారు. 'నేను పెద్దగా చదువుకోలేదు. ఆర్దికంగా బలంగా లేని కుటుంబమే. బ్రతకడం కోసమే సినిమాలవైపు వచ్చాను.
విజయవాడ మారుతి టాకీస్ గేట్ కీపర్ గా కొన్నాళ్లు పనిచేసాను. కొన్నాళ్లకు తాతినేని ప్రకాశరావు గారి ద్వారా మద్రాస్ వ్చాను. మద్రాస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పని చేసాను.ఆ సమయంలో ఎన్నో అవ మానాలు, హేళనలకు ఎదుర్కొన్నాను. సినిమాలకు సంబంధించి చిన్న చిన్న పనులు చేస్తుండేవాడిని. అక్కడ నుంచి ప్రొడక్షన్ వైపు వెళ్లాను. ఇలా కొంత అనుభవం వచ్చిన తర్వాత డబ్బు కూడబెట్టి నిర్మాత అయ్యాను.
87 సినిమాలు నిర్మించాను. వాటిలో 50 విజయం సాధిస్తే 37 సినిమాలు ఆర్దికంగా చాలా ఇబ్బందుల్లోకి నెట్టాయి. 'యమగోల' .. 'చట్టానికి కళ్లులేవు' సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో నేను చనువుగా ఉండేది అమితాబచ్చన్, రజనీకాంత్ లతోనే. ఫోన్ చేస్తే నా కోసం వాళ్లు షూటింగ్ వదిలేసి వచ్చేసిన సందర్భాలెన్నో' అంటూ ఆనాటి జ్ఞపకాలు పంచుకున్నారు.