• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ - అట్లీ గోల.....

విజయ్ - అట్లీ గోల.. భగ్గుమంటున్నారుగా!

| కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ గత ఏడాది షారుక్ ఖాన్ తో తెరకెక్కించిన 'జవాన్' ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-02-26 01:30 GMT

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ గత ఏడాది షారుక్ ఖాన్ తో తెరకెక్కించిన 'జవాన్' ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టి అట్లీకి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. జవాన్ సక్సెస్ తో అట్లీతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ తలపతి విజయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొంటూ KGF సిరీస్, పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్స్ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా రాకింగ్ స్టార్ యష్, అల్లు అర్జున్ ఇద్దరు అన్ని భాషల్లో భారీ మార్కెట్ ఉన్న రియల్ పాన్ ఇండియన్ స్టార్స్ అని చెప్పాడు. ఇక ఇదే జాబితాలో తలపతి విజయ్ 'లియో' మూవీ ని కూడా చేర్చడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంటే తలపతి విజయ్ కూడా పాన్ ఇండియా స్టార్ అని అట్లీ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.

విజయ్ కి తెలుగు, మలయాళం లో మంచి మార్కెట్ ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. విజయ్ గత చిత్రం 'లియో' దాదాపు అన్ని ప్రాంతాల్లో మంచి రిజల్ట్ అందుకుంది. కానీ ఒక హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. లియో మాత్రమే కాదు ఇప్పటివరకు విజయ్ నటించిన ఏ ఒక్క సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు.

అలాంటప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ ఎలా అవుతాడు? ఎలా లియో సినిమాని కేజిఎఫ్ సిరీస్ తో పోలుస్తారు? అంటూ పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి కోలీవుడ్లో ఇటీవల వచ్చిన విక్రమ్, జైలర్, పొన్ని యన్ సెల్వన్ వంటి సినిమాలన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్ వల్ల ప్లాప్ అయ్యాయి.

అలాంటిది విజయ్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పడమే కాకుండా యశ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో విజయ్ ని పోల్చడంతో యశ్, బన్నీ ఫ్యాన్స్ అట్లీ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కోలీవుడ్లో అట్లీ అభిమాన హీరో తలపతి విజయ్ అనే విషయం అందరికీ తెలుసు. విజయ్ తో అట్లీ తేరీ, మెర్సల్, బిగిల్ వంటి హ్యాట్రిక్ సినిమాలు చేశాడు. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యాయి.

Full View
Tags:    
  • Atlee 
  • Vijay 
  • yash 
  • Alluarjun 
  • Leo 
  • Pushpa2 
  • Kgf2 
  • Panindia 
  • Prabhas 
  • Jawan 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS