అట్లీకి సినిమాపై కాకుండా దానిపై ఫోక‌స్ ఎందుకు?

సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-03 17:30 GMT

సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్న నేప‌థ్యంలో మూవీకి సంబంధించి చిన్న వార్త వినిపించినా అది నెట్టింట వెంట‌నే వైర‌ల్ అవుతుంది. అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్టు పై ఆడియ‌న్స్ కు అంత ఆస‌క్తి నెల‌కొంది. ఆ ఇంట్రెస్ట్ తోనే ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అట్లీ మాత్రం ఈ భారీ ప్రాజెక్టు మీద కంటే వేరే ప్రాజెక్టుల‌పై దృష్టి పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ధురంధ‌ర్‌తో పాటూ డాన్3 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్న ర‌ణ్‌వీర్ సింగ్ గ‌త కొన్నేళ్లుగా చింగ్స్ సీక్రెట్ అనే బ్రాండ్ కు అంబాసిడ‌ర్ గా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్స్ ను గ‌తంలో రోహిత్ శెట్టి, అలీ అబ్బాస్ జాఫ‌ర్ లాంటి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్లు చేయ‌గా, అందులో ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించి ఆ బ్రాండ్ కు సంబంధించిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేశారు.

అయితే ఇప్పుడు ఆ యాడ్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని అట్లీ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అట్లీ ఆ యాడ్ పైనే త‌న దృష్టి పెట్టార‌ని స‌మాచారం. ఓ మంచి యాక్ష‌న్ కామెడీ యాడ్ ను సంబంధిత బ్రాండ్ కోసం రూపొందించాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ యాడ్ లో కేవ‌లం ర‌ణ్‌వీర్ సింగ్ మాత్ర‌మే కాకుండా రాజ్‌పాల్ యాదవ్, బాబీ డియోల్ మ‌రియు శ్రీలీల కూడా న‌టిస్తున్నారు.

ఈ యాడ్ ను మేక‌ర్స్ గ‌తంలో కంటే భారీ స్థాయిలో రూపొందిస్తుండ‌గా, దానికి సంబంధించిన షూటింగ్ మెహ‌బూబ్ స్టూడియోస్ లో ఇప్ప‌టికే మొద‌లైంది. ఈ వీకెండ్ కు యాడ్ షూట్ పూర్త‌య్యే ఛాన్సుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న భారీ చిత్రానికి సంబంధించిన మొద‌టి షెడ్యూల్ పూర్తైన వెంట‌నే అట్లీ ఈ యాడ్ షూట్ కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. మ‌రి అట్లీ ఎంతో ప‌కడ్బందీగా భారీగా ప్లాన్ చేస్తున్న ఈ యాడ్ ఆడియ‌న్స్ ను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. అయితే ఈ విష‌యంలో మాత్రం బ‌న్నీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఓ వైపు భారీ ప్రాజెక్టు చేతిలో ఉంటే ఇలాంటి చిన్న చిన్న యాడ్స్ కు డైరెక్ష‌న్ చేయ‌డ‌మేంట‌ని అట్లీపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News