• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లవ్ మీ.. హీరో ఆ చాలెంజ్...

లవ్ మీ.. హీరో ఆ చాలెంజ్ లో గెలిచాడు

| దిల్ రాజు నిర్మాణంలో అతని సోదరుడి కొడుకు ఆశీష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-05-27 05:48 GMT

దిల్ రాజు నిర్మాణంలో అతని సోదరుడి కొడుకు ఆశీష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం లవ్ మీ. బేబీ సినిమాతో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో ఆశీష్ కి జోడీగా నటించింది.

ఇప్పటి వరకు హర్రర్ కామెడీ జోనర్ లో ఎక్కువ సినిమాలు వచ్చాయి. అయితే లవ్ మీలో డిఫరెంట్ గా హర్రర్ లవ్ స్టోరీని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అసలు ఎలా ఉంటుందో తెలియని ఘోస్ట్ తో హీరో ప్రేమకథ ఏ తీరాలకి చేరింది. ఇంతకీ మూవీలో ఘోస్ట్ ఎవరనే పాయింట్స్ సినిమాలో కొత్తదనాన్ని చూపించాయి.

మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ గట్టిగానే వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంలో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతున్న ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ లేదు.

ఇలాంటి సమయంలో లవ్ మీ చిత్రానికి డీసెంట్ కలెక్షన్స్ రావడం మంచి విషయం. శనివారం ఆదివారం వీకెండ్స్ కావడంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీకెండ్ తరువాత కూడా గుడ్ రెవెన్యూ దక్కే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్ రెస్పాన్స్ వచ్చిన రెండో రోజుకి మౌత్ టాక్ పెరిగిందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా అందులో నటించిన శిరీష్, అర్జున్ క్యారెక్టర్ తో మెప్పించాడు. మొదటి సినిమా కంటే ఇప్పుడు అతను నటుడిగా చాలా చేంజ్ అయ్యాడు అని చెప్పవచ్చు. కనిపించని భావోద్వేగంతో లవ్ సీన్స్ లో అతను చూపించిన హావభావాలు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఒక దెయ్యం క్యారెక్టర్ తో లవ్ సీన్స్ చేయడం అతనికి బిగ్ చాలెంజ్. ఆ చాలెంజ్ లో అతను గెలిచాడు అని చెప్పవచ్చు.

ఈ సినిమాని దిల్ రాజు సొంతంగా అడ్వాన్స్ బేస్ లో మాట్లాడుకొని రిలీజ్ చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇక పబ్లిక్ ఫోకస్ అంతా సినిమాల వైపు ఉంటుంది. దీంతో వీక్ డేస్ లో మూవీ కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. కథలో కొంత కన్ఫ్యూజన్ ఉందని కొన్ని రివ్యూలు వచ్చినప్పటికీ ప్రేక్షకులకి మాత్రం దర్శకుడు చెప్పిన పాయింట్ కనెక్ట్ అయ్యిందని చిత్ర యూనిట్ చెబుతోంది.

మరి లాంగ్ రన్ లో లవ్ మీ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ ని సాధిస్తుందనేది వేచి చూడాలి. చాలా సినిమాలో ఆరంభంలో మిక్స్ టాక్ తెచ్చుకొని తరువాత మెల్లగా పుంజుకొని బ్లాక్ బస్టర్ అయ్యాయి. లవ్ మీ చిత్రానికి కూడా అలాంటి రిజల్ట్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
  • LoveMe 
  • Ashishreddy 
  • Arunbhimavarapu 
  • Keeravaani 
  • Vaishnavichaitanya 
  • Lovememovie 
  • Ashishloveme 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS