• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేషనల్ అవార్డ్.. అప్పుడు...

నేషనల్ అవార్డ్.. అప్పుడు పార్టీ ఇవ్వడానికి డబ్బులే లేవ్: సీనియర్ యాక్టర్

| సీనియర్ కమ్ స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By - M Prashanth
Update: 2025-08-29 04:37 GMT

సీనియర్ కమ్ స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన యాక్టింగ్ తో ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతారు. ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా అలరిస్తారు. దాదాపు అన్ని భాషల్లో నటించిన ఆయన.. తన 30 ఏళ్ల కెరీర్ లో 300లకు పైగా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు.

ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఫేమస్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఆయన మూవీస్ తగ్గించేశారని చెప్పాలి. కొంతకాలంగా ఆయన సిల్వర్ స్క్రీన్ పై అరుదుగా కనిపిస్తున్నారు. అయితే దాదాపు 20 ఏళ్ల క్రితం ఆయన.. తన యాక్టింగ్ కు గాను నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్‌ చిత్రాల్లో కూడా నటించిన ఆశిష్ విద్యార్థి.. కెరీర్‌ ప్రారంభంలోనే ద్రో కాల్ మూవీకి గాను 1995లో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనను తాజాగా గుర్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఒకప్పుడు బతుకుదెరువు కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇంటి అద్దెను సకాలంలో చెల్లించడం కూడా కష్టమయ్యేదని చెప్పుకొచ్చారు. తనకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ పార్టీ అడగ్గా.. తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అప్పటి వరకు ఎప్పడూ వెళ్లని మెయిన్ ల్యాండ్ చైనా రెస్టారెంట్ కు వెళ్లానన్నారు.

అక్కడే తన ఫ్రెండ్స్ పార్టీ అడిగారని చెప్పారు. తీరా పార్టీకి వెళ్లాక.. అందరూ మద్యం సేవించారని, నాన్ వెజ్ ను ఫుల్ గా తిన్నారని తెలిపారు. ఆ సమయంలో బిల్లు తగ్గించడానికి తాను ఒక గ్లాస్ వాటర్ లో నిమ్మ రసం కలుపుకుని తాగినట్లు చెప్పారు. చివరకు బిల్లు కట్టే విషయంలో ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపారు.

అప్పుడు దర్శకుడు గోవింద్ నిహలాని హెల్ప్ చేసి మొత్తం బిల్లు చెల్లించారని, తాను కృతజ్ఞతలు తెలిపినట్లు అప్పటి రోజులు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆశిష్.. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఫుడ్ బ్లాగర్ గా సందడి చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆదాయం అందుకుంటున్నారు. సినిమాలు మాత్రం తగ్గించారు. రొటీన్ పాత్రలు చేయాలని అనుకోవట్లేదని, కొత్తగా చేసినప్పుడే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుందని ఇటీవల తెలిపారు.

Tags:    
  • AshishVidyarthi 
  • NationalAward 
  • Tollywood 
  • ActorJourney 
  • InspiringStory 
  • ఆశిష్‌విద్యార్థి 
  • జాతీయఅవార్డు 
  • టాలీవుడ్ 
  • Filmindustry 
  • TollywoodNews 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS