ఈ అనార్కలి దూకుడు పెంచుతుందా..?

కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమా చేసింది. తెలుగు ఎంట్రీ ఆ సినిమానే అయినా కింగ్ నాగార్జున చేసిన నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అమ్మడు.;

Update: 2025-10-09 04:49 GMT

కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమా చేసింది. తెలుగు ఎంట్రీ ఆ సినిమానే అయినా కింగ్ నాగార్జున చేసిన నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అమ్మడు. ఆ సినిమాలో తన లుక్స్, యాక్టింగ్ తో ఆకట్టుకున్న ఆషిక సినిమా ఎలాగు సక్సెస్ అయ్యింది కాబట్టి వరుస ఛాన్స్ లు వస్తాయని భావించింది. మరి అవకాశాలు వచ్చినా అమ్మడు చేయలేదో ఏమో కానీ ఆషిక రంగనాథ్ కెరీర్ అంత దూకుడు చూపించలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది ఆషిక.

మహారాజ్ రవితేజతో అనార్కలి సినిమాలో..

ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజతో అనార్కలి సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది అమ్మడు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన అనార్కలి సినిమాలో రవితేజతో కెతిక శర్మ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో ఆషిక కూడా మరో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా విషయంలో టీం అంతా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఐతే నా సామిరంగ హిట్ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుంది ఆషిక. సినిమా హిట్ పడగానే వెంట వెంటనే సినిమాలు చేస్తేనే ఆడియన్స్ లో ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఆ విషయంలో ఆషిక వెనకబడిపోయింది. నాగార్జునతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత అమ్మడికి ఎలా లేదన్నా మంచి అవకాశాలే వచ్చి ఉంటాయి. కానీ వాటిలో తనకు నచ్చిన సినిమా మాత్రమే చేస్తా అని చెప్పి ఉంటే అమ్మడు అన్ లక్కీ అని చెప్పొచ్చు.

కన్నడలో కూడా అమ్మడు..

ఆషిక రంగనాథ్ ప్రస్తుతం అనార్కలి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి అనార్కలి తర్వాత అయినా కెరీర్ దూకుడు పెంచుతుందా లేదా ఇదే తరహా వ్యవహారం కొనసాగిస్తుందా అన్నది చూడాలి. ఓ పక్క కన్నడలో కూడా అమ్మడు ఒకటి రెండు సినిమాల అవకాశాలు అందుకుంది. కార్తి సూపర్ హిట్ సినిమా సర్దార్ సీక్వెల్ గా వస్తున్న సర్దార్ 2 లో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సౌత్ అన్ని భాషల్లో తన సత్తా చాటాలని చూస్తుంది ఆషిక రంగనాథ్.

ఎలాగు నెక్స్ట్ సమ్మర్ కి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఉంది. సో సంక్రాంతికి అనార్కలితో సక్సెస్ అందుకుంటే నెక్స్ట్ చిరు సినిమాతో అమ్మడికి మరింత బూస్టింగ్ లభిస్తుంది. అందం అభినయం రెండు ఉన్నా కూడా ఆషిక ఇలా కెరీర్ లో ఆగిపోవడం ఆమెను ఇష్టపడుతున్న ఆడియన్స్ కి నచ్చట్లేదు.

Tags:    

Similar News