సంక్రాంతి సెంటిమెంట్ తో జూ.అనుష్క.. వర్కౌట్ అయ్యిందా?

టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి అటు హీరోలు ఇటు దర్శకనిర్మాతలు మంచి ఎంటర్టైన్మెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.;

Update: 2026-01-05 17:30 GMT

టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి అటు హీరోలు ఇటు దర్శకనిర్మాతలు మంచి ఎంటర్టైన్మెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడానికి హీరోలే కాదు ఇమేజ్ ని పెంచుకోవడానికి హీరోయిన్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలా ఈమధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఎక్కువగా సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని.. సినిమాలు రిలీజ్ చేస్తూ అందరి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు.

అలా గత రెండు సంక్రాంతి పండుగలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాతో మరోసారి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అయ్యింది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి జూనియర్ అనుష్కగా పేరు సొంతం చేసుకున్న ఆషికా రంగనాథ్ కూడా చేరిపోయింది. నటనతోనే కాదు అందంతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సంక్రాంతి సెంటిమెంటుగా బరిలోకి దిగుతోంది.

అంతేకాదు గ్లామర్ డోస్ పెంచిన ఈమె ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తోంది.వాస్తవానికి కన్నడ అమ్మాయిగా పేరు తెచ్చుకున్న ఆషిక రంగనాథ్ గత రెండు సంవత్సరాల క్రితం నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది . ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మరోసారి సంక్రాంతిని సెంటిమెంట్ గా పెట్టుకొని అటు గ్లామర్ డోస్ పెంచిన ఈమె..తాజాగా రవితేజ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో డింపుల్ హయతి కూడా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నేను శైలజ అనే సినిమాకి దర్శకత్వం వహించిన కిషోర్ కే తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా హీరోయిన్ ఆశికా రంగనాథ్ గ్లామర్ డోస్ కి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఈమె హాట్ ట్రీట్ తెరపై చూడాలని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఒకవైపు సంక్రాంతి సెంటిమెంట్.. మరొకవైపు గ్లామర్ డోస్ తో బరిలోకి దిగుతోంది.. ఒకవేళ ఈ రెండు గనుక ఈమెకు వర్కౌట్ అయిందంటే మాత్రం వరుసగా అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమెకి ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో నయనతార, ది రాజా చిత్రంతో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ లతోపాటు అనగనగా ఒక రాజు చిత్రంతో మీనాక్షి చౌదరి, అటు జననాయగన్ తెలుగు డబ్బింగ్ వర్షన్ జననాయకుడు సినిమాతో పూజా హెగ్డే , భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో డింపుల్ హయతి ఈ సంక్రాంతికి సక్సెస్ కొట్టాలని తెగ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. మరి వీరందరిలో ఆషికా రంగనాథ్ ఏ విధంగా సంక్రాంతి బ్యూటీగా పేరు దక్కించుకుంటుందో చూడాలి. మరి ఈ కన్నడ ముద్దుగుమ్మకు తెలుగు అతిపెద్ద పండుగ సంక్రాంతి ఏవిధంగా కలిసి వస్తుందో.

Tags:    

Similar News