ఆర్యన్ ఖాన్ కెమెరా ముందు అందుకే నవ్వడా?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకుంటే.. అందరినీ ఆశ్చర్యపరిచేలా డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు.;
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకుంటే.. అందరినీ ఆశ్చర్యపరిచేలా డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు డెబ్యూ మూవీ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఆర్యన్ ను చూస్తే.. చిన్న షారుక్ లా కనిపిస్తాడు. కానీ ఓ విషయంలో మాత్రం కాదు. సాధారణంగా షారుక్.. ఫోటోలకు పోజులిచ్చినప్పుడు కచ్చితంగా నవ్వుతారు. ఆర్యన్ మాత్రం నవ్వడు. సీరియస్ లుక్ లో కనిపిస్తుంటాడు. ఎందుకు ఆర్యన్ సీరియస్ గా ఉంటాడని కొందరు నెటిజన్లు డిస్కస్ చేసుకోగా.. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది!
ఆర్యన్ ఖాన్ డెబ్యూ మూవీలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతడికి కెమెరా ముందు నవ్వడమంటే భయమని, అందుకే నవ్వరని చెప్పారు. అదే వైఖరిని కొనసాగించడానికి ఇష్టపడతాడని, కానీ మా విషయంలో మాత్రం నవ్విస్తుంటారని రాఘవ్ చెప్పుకొచ్చారు.
ఆర్యన్ లో చిన్న పిల్లల శక్తి ఉందని, కానీ కెమెరా ముందు అతనికి నవ్వడం అలవాటు లేదని తెలిపారు. అయితే అది నాకు, గర్ల్ ఫ్యాన్స్ కు బాగా ఇష్టమని చెబుతూ నవ్వేశారు. ఒక రోజు తాను ఖచ్చితంగా కెమెరా ముందు నవ్విస్తానని చెప్పగా, అప్పుడు అతను వద్దు బ్రో.. అలా చేయవద్దు బ్రో అంటూ రిక్వెస్ట్ చేశాడని గుర్తు చేసుకున్నారు.
అందుకే అతడిని ఎప్పుడు కలిసినా.. తాను నవిస్తానని చెబుతానని తెలిపారు. అదే సమయంలో ఆర్యన్ మూవీలో నటిస్తున్న లక్ష్య కూడా మాట్లాడారు. ఒకవేళ ఆర్యన్ నవ్వినా.. ఆ ఫోటోలు అస్సలు బయటికి రావని చెప్పారు. దీంతో ఇప్పుడు రాఘవ్ జుయాల్, లక్ష్య చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
దీంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. అందుకే ఆర్యన్ నవ్వడా అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ మూవీ, థియేటర్ లో కాకుండా సెప్టెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ ను క్రియేట్ చేసింది. సినిమా కంటెంట్ అదే స్థాయిలో ఉంటే ఆర్యన్ కు డెబ్యూతో హిట్ పడడం ఖాయం. మరేం జరుగుతుందో వేచి చూడాలి.