వారసుడికి డైరెక్షన్ ఐడియా డాడ్ దా?
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ అవుతున్నాడు? అంటే అభిమానులు ఎంతగా ఆవేదన చెందారో తెలిసిందే.;
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ అవుతున్నాడు? అంటే అభిమానులు ఎంతగా ఆవేదన చెందారో తెలిసిందే. షారుక్ నట వారసత్వాన్ని కొనసాగించాల్సిన వారసుడు డైరెక్టర్ అవ్వడం ఏంటని మదన పడ్డారు. తమ అభిమాన హీరోలా ఆర్యన్ ఖాన్ కూడా మ్యాకప్ వేసుకుని కెమెరా ముందుకు రావాలని కోరారు. షారుక్ పై చూపించే కోట్లాది మంది అభిమానం ఆర్యన్ ఖాన్ పైనా చూపిస్తామని ధీమా వ్యక్తం చేసారు. కానీ ఆర్యన్ ఖాన్ కి ఇవేం అర్దం కాలేదు. తాను బాలీవుడ్ లో డైరెక్టర్ మాత్రమే అవ్వాలనుకున్నాడు. క్రియేటివ్ రంగంలో రాణించాలని ఆశపడి అటుగా వెళ్లాడు.
షారుక్ సలహాతో కొత్త ఆలోచన:
తొలి సినిమా `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` తో సక్సెస్ కూడా అందుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అసలు సంగతేంటి? అంటే డైరెక్టర్ అవ్వాలన్నది ఆర్యన్ ఖాన్ కోరిక కాదు. షారుక్ ఖాన్ మాటగా తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత ఆర్యన్ ఖాన్ రైటర్ గా స్రిప్ట్ మాత్రమే రాసుకున్నాడుట .దాన్ని డైరెక్ట్ చేయాలనే ఆలోచన తనకి లేదని తెలిసింది. ఆ తర్వాత విషయం తెలిసిన షారుక్ ఆ కథని నువ్వే డైరెక్ట్ చేయి అని షారుక్ కోరాడుట. తన మనసును అనురించి డైరెక్ట్ చేయి అని సలహా ఇచ్చినట్లు షారుక్ తెలిపాడు. అలా డాడ్ మాటకు కట్టుబడి ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
తుది నిర్ణయం ప్రేక్షకులదే:
పిల్లల విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్నది షారుక్ ఎప్పుడూ చెప్పరుట. 35 ఏళ్లగా సినిమాల్లో ఉన్నానని తాను చెప్పిందే చేస్తే ? వాళ్లు ఎందుకని షారుక్ అంటున్నారు. తమకంటూ సొంత విజన్ ఉండాలన్నారు. సుహానా నటనలో ఉన్నప్పుడు, ఆర్యన్ ఖాన్ రచయితగా ఉన్నప్పుడు వాళ్లకి ఆ విషయాలు చెప్పి మాత్రమే ప్రోత్సహించానన్నారు. ఇలా ఉండాలని తాను మాత్రం ఎలాంటి సలహాలు ఇవ్వలేదని... ఎలా ఉండాలి? అన్నది వాళ్ల ఇష్టం మేరకే వదిలేసినట్లు తెలిపారు. తాము చేసింది తప్పా? రైటా? అన్నది పూర్తయిన తర్వాత చూపిస్తే కొంత వరకూ ఏదైనా చెప్పగలను అన్నారు.
తండ్రితో తనయ తొలిసారి:
షారుక్ అనే భావన వారికి ఉండకూడదన్నారు. అంతిమంగా నిర్ణయం మాత్రం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ `కింగ్` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో షారుక్ తనయ సుహానా ఖాన్ నటిస్తోంది. `ది ఆర్చిస్` తో లాంచ్ అయిన తర్వాత సుహానా నటిస్తోన్న చిత్రమిది. ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. షారుక్ తో సమానంగా ఆ పాత్ర సాగుతుంది.