డెబ్యూతోనే స్టార్ హీరో వార‌సుడు ఓ సంచల‌నం!

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` తో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-27 00:30 GMT

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` తో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ నెట్ ప్లిక్స్ లో విడుద‌లైంది. మొద‌టి ఎపిసోడ్ కి నాట్ బ్యాడ్ అనే రివ్యూ వ‌చ్చేసింది. మేకింగ్ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించాడు. ఫిల్మ్స్ స్కూల్స్ లో నేర్చుకున్న అనుభ‌వంతో ఆర్య‌న్ ఖాన్ బాగానే డీల్ చేసాడు. భ‌విష్య‌త్ లో మంచి డైరెక్ట‌ర్ అవుతాడు? అన్న న‌మ్మ‌కం బాలీవుడ్ కి క‌లుగుతోంది. షారుక్ ఖాన్ న‌మ్మ‌కం కూడా బ‌ల‌ప‌డింది. త‌న‌యుడు క్రియేటివ్ రంగంలో రాణిస్తాడా? లేదా? అన్న సందేహం రిలీజ్ ముందు వ‌ర‌కూ షారుక్ లో క‌నిపించేది.

హీరోగా ఎంట్రీ ఇవ్వ‌కుండా అన‌వ‌స‌రంగా రిస్క్ తీసుకుంటున్నాడా? అన్న ఆందోళ‌న‌లో షారుక్ లో క‌నిపించేది. కానీ తొలి ఎపిసోడ్ తో గుర్తింపు రావ‌డంతో షారుక్ రిలాక్స్ అవుతున్నాడు. ఇదంతా ప‌క్క‌న బెడితే? తొలి సీజ‌న్ తోనే ఆర్యన్ ఖాన్ అన్ని మాద్య‌మాల్లోనూ హాట్ టాపిక్ గా మారాడు. సాధార‌ణంగా ఇంత‌టి హైప్ ఎవ‌రికీ రాదు. కానీ ఆర్య‌న్ ఖాన్ కి సాధ్య‌మైంది? అంటే అందుకు ప్ర‌త్యేక కార‌ణం ఎవ‌రో చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌డే స‌మీర్ వాఖండే. డ్ర‌గ్స్ కేసులో ఆర్య‌న్ ఖాన్ మాజీ నార్కోటెక్స్ అధికారి స‌మీర్ వాఖండే చేతుల్లోనే పట్టుబడిన సంగ‌తి తెలిసిందే.

ఈ సీజ‌న్ రిలీజ్ అయిన అనంత‌రం స‌మీర్ త‌న‌ని...న్యాయ వ్య‌వ‌స్థ‌ని టార్గెట్ చేసి సీరిస్ రూపొందించ‌డ‌ని చేసిన ఆరోప‌ణ‌లు దేశ వ్యాప్తంగా ఎంతో సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఈ ఒక్క ఘ‌ట‌న‌తో `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. సిరీస్ లో ఏముందో చూడాలి? అన్న ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది.

సాధార‌ణంగా తెలుగు ఆడియ‌న్స్ ఇలాంటి సిరీస్ ల ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు.

కానీ సీన్ లోకి స‌మీర్ వాఖండే రావ‌డంతో? అత‌డి గురించి ఆర్య‌న్ ఖాన్ ఏం చెప్పాడో చూద్దాం అన్న ఆస‌క్తి మొద‌లైంది. ఆర్య‌న్ ఖాన్ సిరీస్ గురించి చేసిన ప్ర‌చారం కంటే స‌మీర్ వాఖండే కోర్టులో కేసులు వేయ‌డంతోనే కావాల్సినంత ప‌బ్లిసిటీ ద‌క్కింది. సోష‌ల్ మీడియాలో ఆర్య‌న్ ఖాన్ వ‌ర్సెస్ స‌మీర్ వాఖండే పేరిట ప్ర‌త్యేక క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. డెబ్యూతోనే ఆర్య‌న్ ఖాన్ ఈ రేంజ్ లో సంచ‌ల‌నమ‌వుతాడ‌ని తాను కూడా ఊహించి ఉండ‌డు. సినిమా అయినా..సిరీస్ అయినా వివాదాస్ప‌దమైతే? ప‌బ్లిసిటీ కోసం పెద్ద‌గా ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు. జ‌నాల్లోకి ఆ వివాద‌మే తీసుకెళ్లిపోతుంద‌ని మ‌రోసారి రుజువైంది.

Tags:    

Similar News