బన్నీ సుక్కు లేకుండా మరో ఆర్య.. సాధ్యమేనా?
'ఆర్య' సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. దిల్ రాజు, సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్‌కు సాలిడ్ బూస్ట్ ఇచ్చిన సినిమా. లవ్ స్టోరీల్లో అదో ట్రెండ్ సెట్ చేసింది.;

'ఆర్య' సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. దిల్ రాజు, సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్‌కు సాలిడ్ బూస్ట్ ఇచ్చిన సినిమా. లవ్ స్టోరీల్లో అదో ట్రెండ్ సెట్ చేసింది. పాటలు, క్యారెక్టరైజేషన్, స్టైల్.. ఏ కోణంలో చూసుకున్నా ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఆ మధ్య ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తి కాగా, టీమ్ అంతా కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు, సుకుమార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆర్య వచ్చిన ఐదేళ్ల అనంతరం మరో నిర్మాతతో 'ఆర్య 2' సినిమా చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సఫలం కాలేదు. అయినప్పటికీ, 'ఆర్య' సినిమా యొక్క విజయం అభిమానుల్లో గుర్తింపును కొనసాగించింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు 'ఆర్య 3' టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేయడం మరో హైలెట్. దిల్ రాజు ఈ సినిమాకు మరోసారి జీవం పోసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
దిల్ రాజు ఈ సినిమాపై ఆసక్తి గట్టిగానే ఉంది. కానీ, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా ఇప్పట్లో చేసే అవకాశం లేదు. వారి ముందున్న కమిట్మెంట్స్ కు మరో నాలుగు ఏళ్ల సమయం పట్టవచ్చు. 'పుష్ప 3' సినిమా పూర్తి కావాల్సి ఉంది. దేశం మొత్తం ఇప్పుడు ‘పుష్ప 3’ మూడ్‌లో ఉంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు బన్నీ లైనప్ లో అట్లీ - త్రివిక్రమ్ - వంగా లాంటి దర్శకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ‘ఆర్య 3’ కోసం సమయం పడుతుంది.
కానీ దిల్ రాజు 'ఆర్య 3'పై ఆసక్తి గట్టిగానే ఉంది. దీంతో సుకు సహాయంతో దిల్ రాజు వేరే వారితో ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్ దగ్గర కథ మాత్రమే తీసుకొని, మరో హీరో, మరో దర్శకుడు కలిసి ఈ సినిమాని పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ, అభిమానులు అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లోనే 'ఆర్య 3'ను చూడాలని కోరుకుంటున్నారు.
ఈ కాంబినేషన్ మ్యాజిక్ మరోసారి స్క్రీన్‌పై కనపడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ విషయంపై రాజుగారి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. వేరే వాళ్ళతో చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. కంటెంట్ ఎంతో ఫ్రెష్ గా ఉంటే గాని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. మరి సుకుమార్ దిల్ రాజు కోరిక మేరకు కథను అందిస్తారో లేదో చూడాలి.