• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరవింద్ కృష్ణ సూపర్ హీరో...

అరవింద్ కృష్ణ సూపర్ హీరో లుక్.. ఏమున్నాడ్రా బాబు..

| ఓ వైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-26 06:11 GMT

ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటుల కెరీర్ మారిపోతూ ఉంటుంది. ఇది యంగ్ హీరో అరవింద్ కృష్ణ విషయంలో కూడా అక్షరాలా నిజమైంది. యంగ్ ఇండియా మూవీతో హీరోగా మారిన ఆయన.. ఆ తర్వాత ఇట్స్ మై ల‌వ్ స్టోరీ, రుషి, అడ‌వి కాచిన వెన్నెల‌ వంటి పలు సినిమాలు చేశారు. ప్రేమ‌మ్‌, రామారావు ఆన్ డ్యూటీతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఓ వైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు.


రీసెంట్ గా వచ్చిన SIT మూవీతో మంచి పేరు సంపాదించుకున్నారు అరవింద్ కృష్ణ. ఓటీటీ జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన అరవింద్ కృష్ణ యాక్టింగ్ కు సర్వత్రా ప్రశంసలు కురిశాయి. మే 10వ తేదీ స్ట్రీమింగ్ కు వచ్చిన సిట్ మూవీ.. 50 రోజులు అవుతున్నా ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. ఆ సినిమా తర్వాత ఆయన వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.


అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అటు స్పోర్ట్స్ లో.. ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ మూవీ చేస్తున్నారు. సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏ మాస్టర్ పీస్ మూవీలో అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

అయితే సూపర్ హీరో అవతార్‌ లో అరవింద్ కృష్ణ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్‌ లో అరవింద్ కృష్ణ అదరగొట్టేశారు. స్పెషల్ బైక్ పై దిగిన పిక్ వేరే లెవెల్ లో ఉంది. పెర్ఫెక్ట్ సూపర్ హీరోలా కనిపిస్తున్నారు. మూవీలో ఆయన యాక్షన్ అదిరిపోయేలా ఉండనుందని అర్ధమవుతోంది. ఇప్పటికే టీజర్ లో తన టాలెంట్ తో అరవింద్ ఓ రేంజ్ లో అలరించారు.

ఈ సినిమాతో పాటు అరవింద్ కృష్ణ మరికొన్ని అడ్వెంచర్ సినిమాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చిన అన్ని అవకాశాలను పరిశీలిస్తూ.. ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. కేవలం ఛాలెంజింగ్‌ గా ఉండే పాత్రలను ఎంచుకుంటున్నారట. త్వరలో అరవింద్ కృష్ణకు చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయని టాక్. మరి అరవింద్ కృష్ణ.. వరుస సినిమాలతో ఎలాంటి హిట్లు అందుకుంటారో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • ArvindKrishna 
  • Amasterpiece 
  • Socialmedia 
  • Sit 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS