ట్రైలర్ టాక్ః దేవుడు చనిపోయాడట..! దుమ్ములేపుతున్న ‘జస్టిస్ లీగ్’!
డేంజర్ ‘బెల్స్ మోగాయి’.. అంటూ మొదలైన ‘జస్టిస్ లీగ్’ ట్రైలర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మోత మోగిస్తోంది. అభిమానులను ఊపేస్తోంది. ‘దేవుడు చనిపోయాడు’ అంటున్న వాయిస్ ఓవర్.. ఇంతకు ముందెన్నడూ వినని సరికొత్త అనుభూతిని కలిగిస్తుంటే.. యుద్ధానికి యోధులు కావాలంటూ పిలుపునిస్తున్న ఓ క్యారెక్టర్ మూవీ కండీషన్ ఏంటో రివీల్ చేస్తోంది.
సూపర్ హీరో మూవీస్ లో జస్టిస్ లీగ్ పేరు తెలియని వారుండరు. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను అలరించే సూపర్ హీరో సినిమాల్లో జస్టిస్ లీగ్ కూడా ఒకటి. ఈ మూవీ వస్తోందంటే అభిమానులంతా హై అటెన్షన్ తో రెడీగా ఉంటారు. మేకర్స్ కూడా వారిని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా.. యాక్షన్ సీన్స్ కండక్ట్ చేస్తుంటారు.
తాజాగా రిలీజ్ చేసిన జస్టిస్ లీగ్ ట్రైలర్ ఫుల్ వైరల్ అవుతోంది. పలు సన్నివేశాలు విజువల్ వండర్ లా అనిపిస్తుంటే.. యాక్షన్ సన్నివేశాలు మరింత రోమాంచితంగా కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ మొత్తం అభిమానులను మునివేళ్లపై నిలబెడుతోంది. అయితే.. ట్రైలర్ మొత్తం యుద్ధ సన్నివేశాలు అలరించగా.. చివర్లో జోకర్ చెప్పిన డైలాగ్స్ మాత్రం ఆలోచింపజేస్తున్నాయి.
‘‘గౌరవం అనేది సుదూర జ్ఞాపకంగా మారిపోయిన సమాజంలో మనం బతుకుతున్నాం కదా.. బ్యాట్ మాన్? అంటూ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చడం.. సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. దీంతోపాటు.. మిగిలిన డైలాగ్స్.. యాక్షన్ సీన్స్ మొత్తం ఇప్పటి వరకూ సినిమాపై ఉన్న హైప్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాయి.
అట్లాస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ పై గ్రెగర్ విల్సన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. జాక్ స్నైడర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో.. బెన్ ఎఫ్లెక్, హెనర్రీ కావిల్, ఆడమ్స్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. టామ్ హాల్కెన్ బర్గ్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ.. మార్చి18న థియేటర్ లో సందడి చేయనుంది.
Full View