• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగన్‌ కోసం 'యాత్ర'...

జగన్‌ కోసం 'యాత్ర' వెయిటింగ్‌

By - Tupaki Desk
Update: 2019-01-25 07:51 GMT
రాజశేఖర్‌ రెడ్డి జీవితంలోని కీలక ఘట్టాలను తీసుకుని మహి వి రాఘవ తెరకెక్కించిన బయోపిక్‌ 'యాత్ర'. మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం కోసం వైఎస్‌ ఆర్‌ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదలకు ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

జనవరి చివరి వారంలో ఈ వేడుక ప్లాన్‌ చేశారట. జగన్‌ ను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తీసుకు వచ్చేందుకు యాత్ర మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ అవ్వని కారణంగా జనవరి చివరి వారం లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో యాత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఉంటుందని చెబుతున్నారు. జగన్‌ ఎప్పుడంటే అప్పుడు మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించాలని భావిస్తున్నారు. ఇటీవలే పాదయాత్రను ముగించుకుని వచ్చిన జగన్‌ పార్టీ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. దాంతో యాత్రకు సమయం కేటాయిస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం చాలా నమ్మకంగా జగన్‌ డేట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా జగన్‌ 'యాత్ర' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొంటాడంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న యాత్ర సినిమా అన్ని ఏరియాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అనసూయ మరియు జగపతిబాబులు కనిపించబోతున్నారు.
Tags:    
  • YSR Biopic 
  • Ys Jagan 
  • yatra movie 
  • Telugu News 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS