ఇంత గందరగోళంలో వద్దు..పెళ్లిపై యంగ్ హీరో కామెంట్స్‌

Update: 2021-01-09 13:30 GMT
బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్ ధావన్‌ పెళ్లి వార్తలు జాతీయ మీడియాలో గత రెండేళ్లుగా వస్తూనే ఉన్నాయి. నటాషా దలాల్ తో ఈయన ప్రేమలో ఉన్నట్లుగా అధికారికంగా వెళ్లడి అయినప్పటి నుండి ఈయన్ను ఎక్కడకు వెళ్లినా కూడా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో పెళ్లి విషయమై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతా బాగుంటే గత ఏడాది పెళ్లి అయ్యేది. కాని కరోనా కారణంగా మొత్తం ప్రపంచం గందరగోళం ఉంది. ఇలాంటి సమయంలో నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. నా పెళ్లి విషయంలో నాకున్న ప్లాన్స్‌ ను త్వరలోనే వెళ్లడిస్తాను అన్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అంతా బాగుంటే వచ్చే ఏడాదిలో తన పెళ్లి ఉంటుందని వరుణ్‌ క్లారిటీ ఇచ్చాడు.

ఇక వరుణ్‌ సినీ కెరీర్‌ విషయానికి వస్తే సూపర్‌ హిట్‌ మూవీ కూలీ నెం.1 ను తండ్రి దర్శకత్వంలో రీమేక్ చేశాడు. సినిమా ను థియేటర్లు లేని కారణంగా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. యాక్షన్‌ సన్నివేశాల విషయంలో కాస్త ట్రోల్‌ అయినా కూడా ఓవరాల్‌ గా మాత్రం సినిమాకు పర్వాలేదు అన్నట్లుగా టాక్ వచ్చిందని బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం వరుణ్‌ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే వాటి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News