హీరోయిన్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌

Update: 2020-08-18 05:45 GMT
తెలుగమ్మాయి ఈషా రెబ్బా టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు వెబ్‌ సిరీస్‌ ల్లో బిజీ బిజీగా నటిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఈమె తన ఫొటో షూట్స్‌ మరియు ఇతరత్ర విషయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటుంది. ట్విట్టర్‌ లో ఈమె భారీగానే ఫాలోవర్స్‌ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈమె ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. ఆమె అకౌంట్‌ మొత్తం లేదని చూపిస్తుందట.

ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఈషా రెబ్బా ఈ విషయాన్ని చెప్పింది. నా ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది దాన్ని ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించగా అకౌంట్‌ లేదు అనే మెసేజ్‌ వస్తుందని పేర్కొంది. ఈమద్య కాలంలో సెలబ్రెటీల ట్విట్టర్‌ అకౌంట్స్‌ హ్యాక్‌ చేయడం చాలా కామన్‌ అయ్యింది. ఎంతో మంది సెలబ్రెటీల ట్విట్టర్‌ అకౌంట్స్‌ హ్యాక్‌ అయ్యాయి. ఇప్పుడు ఈషా రెబ్బా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.

ప్రస్తుతం ఆమె టెక్నికల్‌ టీం అకౌంట్‌ ను మళ్లీ తమ పరిధిలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విట్టర్‌ ఇండియా ప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ విషయంలో సాయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈషా హిందీ లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌ తెలుగు వర్షన్‌ లో నటిస్తోంది. అది మాత్రమే కాకుండా మరో వెబ్‌ సిరీస్‌ కు ఇటీవలే ఓకే చెప్పింది. ఇక రెండు మూడు సినిమాలను కూడా ఈమె చేస్తోంది.
Tags:    

Similar News