టాప్ స్టోరి: రాఖీ భాయ్ అంతటివాడికే దడ పుట్టించే రావణాసురులు!
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో రాకింగ్ స్టార్ యష్ రాఖీ భాయ్ గా మారారు. అతడి రగ్డ్ లుక్, ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని వాడు లేడు.;
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో రాకింగ్ స్టార్ యష్ రాఖీ భాయ్ గా మారారు. అతడి రగ్డ్ లుక్, ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని వాడు లేడు. రణబీర్ అంతటి స్టార్ యష్ ని పొగిడేస్తూ, అతడి స్టార్ డమ్ అసాధారణమైనదని రావణుడి పాత్రకు అతడు తప్ప ఇంకెవరూ సరిలేరు అని కితాబిచ్చేసాడు.
అయితే రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్న యష్ కి రియల్ ఛాలెంజ్ ముందుంది. సినిమా హిస్టరీలో దిగ్గజాలైన లెజెండరీ నటులు రావణుడి పాత్రను చించి ఆరేసారు. ఇండియన్ సినిమా మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్, లెజెండరీ విశ్వ విఖ్యాత నట చక్రవర్తి ఎస్వీఆర్ రావణాసురుడిగా పెర్ఫామ్ చేసిన తీరుకు ప్రపంచమే ఫిదా అయింది. నవరస నటసార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ కూడా రావణుడిగా అద్భుత నటనా కౌశలంతో మెరిపించారు. ఇంకా దిగ్గజ నటులు ఎందరో రావణుడి పాత్రలో నటించి మెప్పించారు.
సినిమా హిస్టరీలో ఎవరెవరు రావణాసురుడి పాత్రలో నటించారు? వారి అభినయ కౌశలం ప్రావీణ్యత ఎలాంటివి? అన్నది విశ్లేషిస్తే తెలిసిన సంగతులు ఈ కింద ఉన్నాయి...
అత్యంత ప్రమాదకరమైన మైన్స్ లో మాఫియాను ఏరి పారేస్తూ.. బంగారం వేట సాగించిన `రాఖీ భాయ్` యష్ ఇప్పుడు వెండితెరపై అత్యంత శక్తివంతమైన రావణాసురుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న `రామాయణం` చిత్రంలో యష్ రావణుడిగా నటిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. `కేజీఎఫ్` సిరీస్‌తో తన రగ్డ్ లుక్ , ఇంటెన్సివ్ నటనతో గ్లోబల్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న యష్‌కు రణబీర్ కపూర్ వంటి స్టార్లే ఫిదా అయిపోయారు. రావణుడి పాత్రకు యష్ తప్ప మరెవరూ సెట్ అవ్వరని రణబీర్ కితాబిచ్చినా.. యష్ ముందు ఇప్పుడు ఒక భారీ సవాల్ పొంచి ఉంది.
భారతీయ చలనచిత్ర చరిత్రలో రావణాసురుడి పాత్రను వెండితెరపై చిరస్మరణీయం చేసిన దిగ్గజ నటుల అప్రతిహత నటనా కౌశలం యష్‌ను భయపెడుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో `విశ్వ విఖ్యాత నట సార్వభౌమ` ఎన్టీఆర్ .. `నట చక్రవర్తి` ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్) వేసిన ముద్ర చెరగనిది. ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన `సీతారామ కళ్యాణం`, `శ్రీరామ పట్టాభిషేకం` వంటి చిత్రాల్లో రావణుడిగా అద్భుత నటనను కనబరిచారు. అటు `సంపూర్ణ రామాయణం`లో ఎస్వీఆర్ తన గంభీరమైన కంఠస్వరం, ఆహార్యంతో రావణుడి పాత్రకు ఒక కొత్త గరిమను తీసుకొచ్చారు. వీరిద్దరి నటన ఈనాటికీ ఆ పాత్రకు ఒక బెంచ్ మార్క్‌గా నిలిచిపోయింది. తెలుగులో మరో వెర్సటైల్ నటుడు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కూడా రావణుడిగా తనదైన ముద్ర వేశారు. 1977లో వచ్చిన `సీతారామ వనవాసం`చిత్రంలో ఆయన పోషించిన రావణ పాత్ర ఆ కాలంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
దక్షిణాది సినిమాల్లో రావణుడి పాత్రను విభిన్న కోణాల్లో ఆవిష్కరించిన ఇతర నటుల ప్రభావం కూడా యష్‌పై ఉంటుందనడంలో సందేహం లేదు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ `భూకైలాస` చిత్రంలో రావణుడిగా భక్తిని, గర్వాన్ని అద్భుతంగా పలికించారు. అలాగే మలయాళంలో కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ `శ్రీరామ పట్టాభిషేకం`లో, తమిళంలో ఆర్.ఎస్. మనోహర్ `అగస్త్యర్` చిత్రంలో రావణుడిని అత్యంత గౌరవప్రదమైన రీతిలో చూపించారు. వీరి నటన రావణుడిని కేవలం ఒక విలన్‌గా కాకుండా.. ఒక పండితుడిగా.. బలమైన రాజుగా ఆవిష్కరించింది.
ఆరుగురు దిగ్గజాలు ఎస్వీఆర్, ఎన్టీఆర్, డా. రాజ్ కుమార్, కైకాల, మనోహర్, శ్రీధరన్ నాయర్ రావణాసురుడి పాత్రకు ప్రాణం పోసి.. ప్రేక్షకుల మనసుల్లో ఆ పాత్ర రూపురేఖలను సుస్థిరం చేసేశారు. ఇప్పుడు యష్ వారి సరసన నిలబడాలంటే కేవలం స్టైల్ సరిపోదు.. ఆ స్థాయిలో అభినయ కౌశలం చూపాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రామాయణం పార్ట్-1కు సంబంధించి విడుదలైన గ్లింప్స్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న తరుణంలో, యష్ పాత్రను కేర్ ఫుల్ గా రివీల్ చేయాల్సి ఉంది. గతంలోని లెజెండరీ నటులు నెలకొల్పిన ప్రమాణాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. తన మేనరిజమ్స్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యష్ ఈ ఆరుగురు రావణాసురుల సవాల్‌ను ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఇటీవల ఆదిపురుష్ లో సైఫ్ ఖాన్ కూడా ఆదిపురుష్ గా నటించాడు. కానీ ఆ సినిమాలోని పాత్రల లోపాలను ప్రజలు గుర్తించి తూర్పారబట్టారు. అయితే అందుకు భిన్నంగా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త రావణుడిని యష్ ఆవిష్కరిస్తాడా లేదా అన్నది ఇప్పుడు సినీ అభిమానులందరిలో ఉత్కంఠ రేపుతోంది.