• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలనాటి స్టార్ హీరోయిన్.....

అలనాటి స్టార్ హీరోయిన్.. హ్యాపీ ఫ్యామిలీ ఫోటోలు వైరల్!

By - Tupaki Desk
Update: 2020-06-17 13:00 GMT
హీరోయిన్ రంభ.. అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి స్టార్డం అందుకుంది. దాదాపు తెలుగు స్టార్ హీరోలు అందరితో ఆడిపాడింది రంభ. ఇక సినిమాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుని వెండితెరకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన భర్త.. ముగ్గురు పిల్లలతో ఆనందంగా ఉంటోంది. రంభకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. ఇక తాజాగా తన కుటుంబంతో దిగిన కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. కెనడాకు చెందిన భారతీయ వ్యాపారవేత్త ఇంద్రన్‌ను 2010 ఏప్రిల్‌లో రంభ పెళ్లి చేసుకుంది. వీరి వివాహం కూడా తిరుపతిలోనే జరిగింది. 2011లో రంభ మొదటి కూతురు లాణ్యకు.. 2015లో రెండో కూతురు శాషాకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తరవాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి రంభ 2017లో కెనడా నుంచి చెన్నైకి వచ్చేసింది. కొంతకాలం తర్వాత మళ్లీ భర్త దగ్గరికి వెళ్ళిపోయింది.

ఇక 2018లో వీరికి మగబిడ్డ శివిన్‌ జన్మించాడు. ప్రస్తుతం రంభ ఫ్యామిలీ కెనడాలో ఎంతో హ్యాపీగా జీవిస్తోంది. అయితే 90ల్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అగ్ర హీరోయిన్ రంభ.. విజయవాడలోనే పుట్టి పెరిగింది. రంభ తెలుగుతో పాటు తమిళం.. మలయాళం.. కన్నడ.. హిందీ.. బెంగాలీ భాషల్లో నటించింది. కొంతకాలం సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఊపేసింది. ఇక ‘సర్గం’ అనే మలయాళ సినిమా ద్వారా రంభ వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాను రెండేళ్ల తరవాత తెలుగులో ‘సరిగమలు’ పేరుతో విడుదల చేశారు. ఆ తర్వాత 1992లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ద్వారా టాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయం తో ఆకట్టుకుని అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అంతేగాక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా ఆడి పాడింది. రంభ చివరిగా ‘యమదొంగ’ సినిమా లో ఎన్టీఆర్‌ తో.. నాచోరే నాచోరే అంటూ స్టెప్పులేసి అలరించింది. ఇక 2008లో నటిగా ‘దొంగసచ్చినోళ్లు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తుందని ఫ్యామిలీ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది.
Tags:    
  • Rambha 
  • Rambha cute family Photos 
  • Rambha Latest Images 
  • Rambha Latest Instagram Photos 
  • Rambha Latest Movies 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS