బుజ్జిగాడికి పైరసీ భయం?

Update: 2020-09-30 12:30 GMT
రాజ్‌ తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో రూపొందిన 'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమాను రేపు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. లాక్‌ డౌన్‌ కు ముందు సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు లాక్‌ డౌన్‌ కారణంగా నిలిచి పోయింది. ఆరు నెలల పాటు థియేటర్ల పునః ప్రారంభం కోసం వెయిట్‌ చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు తెలుగు ఓటీటీ అయిన ఆహా ద్వారా సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. గత ఆరు నెలల కాలంలో ప్రీ రిలీజ్‌ వేడుక జరుపుకున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజ్‌ తరుణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సినిమాను తప్పకుండా ఆహా ఓటీటీలో మాత్రమే చూడాలంటూ విజ్ఞప్తి చేశాడు. సినిమాను పైరసీ చూడవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. ఇటీవల విడుదలైన ఒక తెలుగు సినిమాకు వెంటనే ఆన్‌ లైన్‌ లో పైరసి వచ్చింది. రెండవ రోజు నుండే ఆ సినిమా పైరసీ పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లింది. అందుకే బుజ్జిగాడు మేకర్స్‌ కు కూడా ఇప్పుడు ఆ భయం పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఆహాలో విడుదల అయిన ఈ సినిమాను కేవలం ఆహాలో మాత్రమే చూడాలని కోరుతున్నారు. ఎందుకంటే రన్‌ టైం ను బట్టి సినిమా నిర్మాతలకు ఆహా వారు ఇచ్చే అమౌంట్‌ ఉంటుందట. అందుకే యూనిట్‌ సభ్యులు ప్రత్యేకంగా ఆహాలో మాత్రమే చూడండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    

Similar News