తిరువీర్‌..కొన్ని నేర్చుకోవాలేమో?

ఆ స‌త్యాన్ని యువ హీరో తిరువీర్ ఇంకా వంట‌బ‌ట్టించుకున్నాట్టుగా లేడ‌ని ఆయ‌న మాట‌ల్లోనే స్ప‌ష్ట‌మ‌వుతోంది.;

Update: 2026-04-11 16:30 GMT

ఇండ‌స్ట్రీలో సాదా సీదాగా ఉంటే సెట్ బాయే ప‌ట్టించుకోడు.. హీరో అంటే హ‌డావిడీ ఉండాల్సిందే. అప్పుడే చుట్టూ ఓ క్రేజీ వాతావ‌ర‌ణం ఉంటుంది... అలా ఉన్న‌ప్పుడే హీరోకు త‌గిన గౌర‌వం, గుర్తింపు ల‌భిస్తాయి. అలా కాకుండా సాదా సీదాగా ఉంటానంటే చిన్న పిల్ల‌లు కూడా పెద్ద‌గా గుర్తు ప‌ట్ట‌రు... చుట్టూ మందీ మార్బ‌లం లేదంటే పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఇది సినిమా ఇండ‌స్ట్రీలో జ‌గ‌మెరిగిన స‌త్యం. ఆ స‌త్యాన్ని యువ హీరో తిరువీర్ ఇంకా వంట‌బ‌ట్టించుకున్నాట్టుగా లేడ‌ని ఆయ‌న మాట‌ల్లోనే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, అక్క‌డే డైరెక్ట‌ర్‌గానూ ప‌లు నాట‌కాల‌కు వ‌ర్క్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ ఆ త‌రువాత `బొమ్మ‌ల‌రామారం`తో ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలో కెరీర్ ప్రారంభించాడు. ఘాజీ, ఏమంత్రం వేశావే, శుభ‌లేఖ ప్ల‌స్‌లు, మ‌ల్లేశం, జార్జ్‌రెడ్డి వంటి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించాడు. అయితే అత‌నికి పేరు తెచ్చింది మాత్రం ``ప‌లాస 1978`. క‌రుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించి తిరువీర్‌కు న‌టుడిగా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.

అదే నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్‌`లో విలన్‌కు సోద‌రుడిగా క‌రుడుగ‌ట్టిన విల‌న్‌గా న‌టించే అవ‌కాశాన్ని అందించింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ `మ‌సూద‌`తో హీరోగా మారిన తిరువీర్ రీసెంట్‌గా `ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో`తో మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుని చిన్న సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారాడు. దీంతో వ‌రుస‌గా ఆయ‌న కోసం ప్రొడ్యూస‌ర్లు పోటీలుప‌డుతున్నారు..యంగ్ డైరెక్ట‌ర్లు కూడా అదే స్థాయిలో ఆయ‌న‌తో సినిమా చేసి డైరెక్ట‌ర్ కావాల‌ని త‌న‌కు త‌గ్గ క‌థ‌ల‌ని ప‌ట్టుకుని అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న తిరువీర్ ఏప్రిల్ 17న `పాపం ప్ర‌తాప్‌` సినిమాతో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డానికి వ‌స్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో ముచ్చ‌టిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల ఓ సినిమా మీటింగ్ కోసం విమానంలో విజ‌య‌వాడ వెళుతుంటే త‌న‌ని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేద‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన తిరువీర్ తాజాగా అలా ఎందుకు జ‌రిగిందో..జ‌రుగుతోందో వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఇన్ని సినిమాలు చేసినా మీరు హీరోగా ఎందుకు మిమ్మ‌ల్ని ప్రొజెక్ట్ చేసుకోలేక‌పోతున్నార‌ని అడిగితే ఆశ్చ‌ర్య‌ప‌రిచే విధంగా స‌మాధానం చెప్పారు. అలా న‌న్ను నేను ప్ర‌జెంట్ చేసుకోవ‌డం నాకు రాదు` అన్నారు. ఇంకా నేను కొన్ని నేర్చుకోవాలేమో..నాకు లుంగీ, బ‌నియ‌న్ ష‌ర్ట్ ఇచ్చార‌నుకోండీ ఎంత కంఫ‌ర్ట‌బుల్‌గా ఉంటానో బ్లేజ‌ర్ వేసుకుంటే అంత అన్ కంఫ‌ర్ట్ అయిపోతా. అందుకే మోడ‌లింగ్ వ‌దిలేశా. ఇలా ఉండాలి. కారు డోర్ తీసి ఏ కాలు ఫ‌స్ట్ పెట్టాలి. ఇలాంటివ‌న్నీ నాకు బ‌ర్డెన్‌గా అనిపిస్తాయి. అందుకే నాకు ఏది కంఫ‌ర్టో నేను అలాగే ఉంటాను. న‌న్ను ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేద‌నే బాధ‌లేదు. నేను నార్మ‌ల్‌గా చికెన్ సెంట‌ర్‌కి వెళ్లి చికెన్ తెచ్చుకుంటాను. రాంన‌గ‌ర్ వెళ్లి చేప‌లు తెచ్చుకుంటాను. అలా వెళ్ల‌డం నాకు కంఫ‌ర్ట‌బుల్‌. అయితే అవ‌న్నీ నేను న‌వ్వుతూ చెప్పాను. కొంత మంది దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సాడ్‌గా వేసి అలా మార్చారు` ఈ వీడియోని చూసిన వారంతా తిరువీరు ఇంకా మారాలేమో అని కామెంట్‌లు చేస్తున్నారు.

Tags:    

Similar News