హ‌రీష్ శంక‌ర్‌..పంతొమ్మిది క్యాన్సిల్ అయ్యాయా?

తిరువీర్ హీరోగా న‌టించిన మూవీ `పాపం ప్ర‌తాప్‌` ఈ నెల 17న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.;

Update: 2026-04-11 19:00 GMT

తిరువీర్ హీరోగా న‌టించిన మూవీ `పాపం ప్ర‌తాప్‌` ఈ నెల 17న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా టీమ్ ట్రైల‌ర్ పంచాయితీ పేరుతో ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీలో అనుకున్న సినిమాల‌న్నీ జ‌ర‌గ‌వు. అలా స్టార్ట్ అనుకున్న‌వి ఉన్న ఫ‌లంగా ఆగిపోతుంటాయి. ఒక సినిమాకు హీరోలు మారితే మ‌రి కొన్నింటికి డైరెక్ట‌ర్లు మార‌డం కామ‌న్‌. ఇదే విష‌యాన్ని హ‌రీష్ శంక‌ర్ చెబుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఇప్ప‌టి వ‌ర‌కు `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`తో క‌లిపి హ‌రీష్ శంక‌ర్ చేసింది తొమ్మిది సినిమాలు. అయితే క్యాన్సిల్ అయిన‌వి పంతొమ్మిది ఉంటాయ‌ట‌. ఇదే విష‌యాన్ని `పాపం ప్ర‌తాప్‌` డైరెక్ట‌ర్‌ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. డైరెక్ట‌ర్ న‌రేష్‌కి చాలా సినిమాలు అనుకున్న‌వి జ‌ర‌గ‌లేద‌ని తెలిసింది. జ‌స్ట్ మీకు కాన్ఫిడెన్స్ కోసం చెబుతున్నాను. నేను తీసింది తొమ్మిది సినిమాలు అయితే క్యాన్సిల్ అయిన‌వి పంతొమ్మిది ఉంటాయి. ప్రెస్ మీట్‌ల‌కు వ‌చ్చి ఆల్ మోస్ట్ హీరోలు ఓకే చేసి ఎల్లుండి ముహూర్తం అన‌గా క్యాన్సిల్ అయిన సంద‌ర్బాలు ఉన్నాయి.

సో మ‌నం ఇక్క‌డికి వ‌చ్చింది. మ‌న‌కు న‌చ్చిన ప‌ని చేయ‌డానికి అదే స‌క్సెస్‌. మ‌న‌కు న‌చ్చిన ప‌ని ఆడియ‌న్స్‌కు కూడా న‌చ్చింది అనుకో అది స‌క్సెస్ కాదు బోనస్‌. కాబ‌ట్టి మ‌నం బోన‌స్ గురించి అత్యాశ ప‌డొద్దు. స‌క్సెస్ ఫుల్ గానే ఉండాలి. అల్ ది బెస్ట్. సినిమా చాలా చాలా బాగా తీశారు. చుట్టాల‌కి, ప‌ల‌క‌రించే వాళ్ల‌కీ..అంటూ ల్యాంగ్వేజ్‌పై మీకున్న ప‌ట్టు, డైరెక్ట‌ర్‌గా మీ క‌మాండ్ నాకు ఒక్క ట్రైల‌ర్‌లో అర్థ‌మైంది. ప్రీమియ‌ర్ రోజే నేను ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్‌..ఎవ్రీ థింగ్ ప‌ర్‌ఫెక్ట్‌` అన్నారు.

రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా...

హ‌రీష్ శంక‌ర్ ఈ సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్నివెల్ల‌డించారు. ఈటీవీ విన్‌తో తాను కొలాబ‌రేట్ అవుతున్నాన‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ద‌ర్శ‌కుడిగా స్టార్ స్టేట‌స్‌ని ఎంజాయ్ చేస్తున్న హ‌రీష్ శంక‌ర్ ఈటీవీ విన్‌తో కొలాబ‌రేట్ అవ్వ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం అంద‌రిని షాక్‌కు గురి చేసింది. `నేను చాలా సార్లు `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` ఇంట‌ర్వ్యూల్లో చెప్పాను. చాలా క‌థ‌లు మాకున్న క‌మిట్‌మెంట్స్ అవ్వోచ్చు లేక మేము హీరోయిజంని ఇంకో టాంజెంట్‌లో అనుకోవ‌డం మూలంగానో ఎన్నో క‌థ‌లు చెప్ప‌డానికి కొన్ని లిమిటేష‌న్స్ ఉన్నాయి. అలాంటి క‌థ‌ల్ని చెప్ప‌డానికి ఈటీవీ విన్ అనేది ఒక గ్రేట్ ఫ్లాట్ ఫామ్ అని నా ఫీలింగ్‌.

సో ఈ టీవీ విన్‌కు నేను నా ట్రాక్ రికార్డ్‌తోనో ఇంకో దాంతోనో కాకుండా, డైరెక్ట‌ర్‌గా కాకుండా నేనొక ర‌చ‌యిత‌గా వాళ్ల ప్రోటోకాల్స్ అన్నీ,,వాళ్ల హైరార్కే అన్నీ పాటించి ఒక రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా ఈటీవి విన్‌తో కొల‌బ‌రేట్ అవ్వ‌బోతున్నాను. అది వాళ్లు అనౌన్స్ చేస్తే బాగుంటుంది` అన్నారు. ఈ మ‌ధ్య ద‌ర్శ‌కులు తాము చెప్ప‌లేని క‌థ‌ల‌కు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఓటీటీల్లో కొత్త‌వారికి ద‌ర్శ‌కులుగా అవ‌కాశాలు ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే పంథాలో హ‌రీష్ శంక‌ర్ కూడా రంగంలోకి దిగుతుండ‌టంతో మ‌రింత మంది కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు వ‌స్తాయ‌ని, కొత్త త‌ర‌హా సినిమాలు రూపొందుతాయ‌నే టాక్ మొద‌లైంది.



Tags:    

Similar News